పోస్టల్ శాఖలో హెల్త్ ఇన్సూరెన్స్‌పై అవగాహన
ABN, Publish Date - Dec 24 , 2024 | 11:52 PM
హెల్త్ ఇన్సూరెన్స్‌పై ప్రజల్లో పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించా రు.
తెలకపల్లి, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : హెల్త్ ఇన్సూరెన్స్‌పై ప్రజల్లో పోస్టల్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా నాగర్‌కర్నూల్ పోస్టల్ సబ్ డివిజనల్ అధికారి సృజన్‌నాయక్ మాట్లాడుతూ ప్రజ లు హెల్త్ ఇన్సూరెన్స్‌పై అవగాహన కలిగి ఉండడం ఎంతో అవసరమని, దీని కోసం పోస్టల్‌శాఖ ఆధ్వర్యంలో హెల్త్ ఇన్సూరె న్స్ ప్రారంభిస్తుందని ఆయన అన్నారు. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఒక సంవత్సరం కాలం ప్రీమియం 2200 ఉంటుందని, ఇంట్లో నలుగురు సభ్యుల కు 15లక్షల వరకు వర్తిస్తుందని ఆయన తెలి పారు. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరా లు ఉన్న వారు పాలసీ తీసుకోవ చ్చని ఆయన తెలిపారు. ప్రజలందరూ సద్వినియో గం చేసుకోవాలని ఆయన కోరారు. అవగాహ న కార్యక్రమంలో పోస్టల్ సిబ్బంది నాగర్‌క ర్నూల్ పోస్టల్ సబ్ డివిజనల్ అధికారి సృజన్ నాయక్, ఐపీపీబీ బ్రాంచ్ మేనేజర్ యశస్వి, ఎంవోలు మహిమూద్‌ఖాన్, జగన్‌గౌడ్, బీపీఎంలు శంకరయ్య, పి.రాములు, రమాదేవి, మల్లేష్, వెంకటమ్మ, ఇందిరమ్మ, బి.రాములు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Dec 24 , 2024 | 11:52 PM