Hyderabad: బాల్క సుమన్ అత్యుత్సాహం..పోలీసులతో గొడవ, అరెస్ట్
ABN, Publish Date - Jun 21 , 2024 | 12:25 PM
మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ ఇంటి దగ్గర బాల్క సుమన్ నేతృత్వంలో ఆందోళన నిర్వహించారు. ఆ క్రమంలో పోచారం ఇంట్లోకి బీఆర్ఎస్ నేతలు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Balka Suman) మరోసారి వార్తల్లో నిలిచారు. తాజాగా హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ ఇంటి దగ్గర బాల్క సుమన్ నేతృత్వంలో ఆందోళన నిర్వహించారు. ఆ క్రమంలో పోచారం ఇంట్లోకి బీఆర్ఎస్ నేతలు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బాల్క సుమన్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్(brs) నేతలను(leaders) అడ్డుకోగా ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. ఎంత సేపటికీ వినకపోవడంతో బాల్క సుమన్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.
అయితే పోచారం శ్రీనివాస్ రెడ్డి(Pocharam Srinivas reddy) కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని సమాచారం తెలుసుకుని ఆయన ఇంటి వద్దకు చేరుకుని బాల్క సుమన్ నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. అప్పటికే పోచారం సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి చేరుకుని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. అయితే ఈసారి ప్రకటించనున్న మంత్రి వర్గంలో పోచారానికి మంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి:
Pocharam Srinivas Reddy: మిగిలేది ఆ నలుగురేనా..? కాంగ్రెస్‌లోకి పోచారం
Balkampeta Ellamma: 9న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం..
Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Updated Date - Jun 21 , 2024 | 12:28 PM