రామగుండం జెన్‌కో భూముల్లో సింగరేణి ప్లాంట్: భట్టి
ABN, Publish Date - Jun 26 , 2024 | 03:08 AM
రామగుండంలో జెన్‌కోకు చెందిన ప్లాంట్ ఉన్న స్థలంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం కట్టించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
హైదరాబాద్, జూన్ 25(ఆంధ్రజ్యోతి): రామగుండంలో జెన్‌కోకు చెందిన ప్లాంట్ ఉన్న స్థలంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం కట్టించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రస్తుతం అక్కడున్న... జెన్‌కోకు చెందిన 62.5 మెగావాట్ల థర్మల్ కేంద్రం మూతపడనున్న నేపథ్యంలో ఆ భూములను సింగరేణికి అప్పగించాలని మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌తో కలిసి రామగుండం ఎమ్మెల్యే మక్కన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ఉప ముఖ్యమంత్రికి వినతిపత్రాన్ని అందించారు. ఎన్నికల హామీ ప్రకారం థర్మల్ విద్యుత్ కేంద్రం పూర్తిచేస్తామని భట్టి స్పష్టం చేశారు. నిజాం కాలంలో నిర్మించిన చారిత్రక రామగుండం థర్మల్ పవర్ ేస్టషన్ స్థలంలో కొత్త ప్లాంట్‌ను కట్టనున్నామన్నారు.
Updated Date - Jun 26 , 2024 | 03:10 AM