జనవరి 4 నుంచి భజన మండలి స్వర్ణోత్సవాలు
ABN, Publish Date - Dec 27 , 2024 | 12:24 AM
యాదాద్రిభువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలోని పాండు రంగస్వామి భజనమండలి స్వర్ణోత్సవాలు జనవరి 4,5,6వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు చక్రాల నర్సింహ, ప్రధాన కార్యదర్శి పుప్పాల నాగేశ్వర్ తెలిపారు.
భూదాన్‌పోచంపల్లి, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): యాదాద్రిభువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లిలోని పాండు రంగస్వామి భజనమండలి స్వర్ణోత్సవాలు జనవరి 4,5,6వ తేదీల్లో నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్షుడు చక్రాల నర్సింహ, ప్రధాన కార్యదర్శి పుప్పాల నాగేశ్వర్ తెలిపారు. స్థానిక మార్కండేశ్వరస్వామి దేవాలయ ప్రాంగణంలో స్వర్ణ త్సవాల పోస్టర్లను గురువారం ఆవిష్కరించారు. జన వరి 4, 5వ తేదీల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలస్థాయి భజన సంకీర్తన పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఉత్సవాలకు అవఽ దానశారద డాక్టర్ గరికపాటి సరసింహా రావు హాజరవు తారని తెలిపారు. జనవరి 6వ తేదీన రుక్మా బాయి పాండు రంగస్వామి కల్యాణోత్సవం నిర్వహించను న్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భజనమండలి అధ్యక్షుడు చక్రాల నర్సింహ, ప్రధాన కార్యదర్శి పుప్పాల నాగేశ్వర్, సీత సత్యనారాయణ, భారత వెంకటేశం, దోర్నాల శ్రీనాథ్, కొంగరి పండరీనాథ్, అశోక్, చిట్టిమల్ల లక్ష్మీనారాయణ, పెంటయ్య పాల్గొన్నారు.
Updated Date - Dec 27 , 2024 | 12:24 AM