ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bhatti Vikramarka: హైడ్రా గురించి ఆందోళన వద్దు

ABN, Publish Date - Nov 07 , 2024 | 02:46 AM

భవన నిర్మాణాల కోసం రుణాలు మంజూరు చేసే క్రమంలో హైడ్రా గురించి బ్యాంకర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.

  • నిర్మాణ అనుమతులకు దానికి సంబంధం లేదు

  • ఆక్రమణలను అడ్డుకోవడానికే హైడ్రా

  • భవన నిర్మాణాలకు బ్యాంకులు అప్పులు ఇవ్వొచ్చు

  • రియల్టర్లు, బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): భవన నిర్మాణాల కోసం రుణాలు మంజూరు చేసే క్రమంలో హైడ్రా గురించి బ్యాంకర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. భవన నిర్మాణాల అనుమతుల్లో హైడ్రాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. జీహెచ్‌ఎంసీ, టౌన్‌ ప్లానింగ్‌ వంటి ప్రత్యేక విభాగాలు అన్ని అంశాలను పరిశీలించి నిర్మాణ అనుమతులిస్తాయని తెలిపారు. పార్కులు, కుంటలు, చెరువులను ఆక్రమించకుండా హైడ్రా పరిరక్షిస్తుందని చెప్పారు. హైడ్రా కారణంగా నిర్మాణాలకు అనుమతులు రావన్న ఆందోళన బ్యాంకర్లకు అవసరం లేదని వివరించారు. ప్రజా భవన్‌లో బుధవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్యాంకర్లు, రియల్టర్లు, బిల్డర్ల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. స్వయం సహాయక సంఘాలకు ఈ ఏడాది వడ్డీ లేకుండా రూ.20 వేల కోట్ల రుణాలు ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయించిందన్నారు.


వీలైతే అంతకుమించి రుణాలు ఇస్తామన్నారు. స్వయం సహాయక సంఘాలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు బ్యాంకులు వేగంగా రుణాలు మంజూరు చేయాలని, నిబంధనలను సులభతరం చేయాలని కోరారు. స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాల రికవరీ 98 శాతంగా ఉందని, రిస్కు తక్కువగా ఉన్నందున ఈ సంఘాలకు వడ్డీని తగ్గించి, ఎక్కువ మొత్తంలో రుణాలు ఇవ్వాలని సూచించారు. కాగా, ప్రతి నియోజకవర్గంలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామిక(ఎంఎ్‌సఎంఈ) పార్కులను ఏర్పాటు చేస్తున్నామని, వీటిలో మహిళలకు ప్రత్యేక అవకాశాలు కల్పించనున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, మహిళా సంఘాలకు రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకర్లు విశాల దృక్పథంతో వ్యవహరించాలన్నారు. ప్రభుత్వమే బస్సులను కొనుగోలు చేసి మహిళా సంఘాలకు లీజుకివ్వాలన్న ఆలోచన ఉందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. మరోవైపు, గిరిజన ప్రాంత సంఘాలు తీసుకున్న దాదాపు రూ.200 కోట్ల వరకు రుణాలను చెల్లించలేని స్థితిలో ఆ సంఘాలు ఉన్నాయన్నారు. వీటిని మాఫీ చేయడం లేదంటే వన్‌ టైమ్‌ సెటిల్‌మెంట్‌ అవకాశమివ్వడం వంటి అంశాలను పరిశీలించాలన్నారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి దాన కిశోర్‌, సెర్ప్‌ సీఈఓ దివ్య దేవరాజన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 07 , 2024 | 02:46 AM