Bhatti Vikramarka: రుణమాఫీపై కేటీఆర్ మాట్లాడడం సిగ్గుచేటు
ABN, Publish Date - Aug 22 , 2024 | 03:31 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీపై మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లు మాట్లాడడం సిగ్గుచేటని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఎర్రుపాలెం, ఆగస్టు 21: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న రైతు రుణమాఫీపై మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్‌లు మాట్లాడడం సిగ్గుచేటని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. భద్రాద్రి జిల్లా ఎర్రుపాలెం మండలంలో బుధవారం పర్యటించిన భట్టి పలుచోట్ల రహదారులకు శంకుస్థాపన చేశారు.
అనంతరం జమలాపురంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పాలనలో రైతులకు రూ.లక్ష రుణమాఫీని నాలుగు దఫాలుగా చేశారని, ఆ ప్రక్రియను కూడా సరిగా జరగలేదన్నారు. అధికారం చేపట్టి ఏడాది కూడా గడవకుండానే ఒకేసారి రూ.2లక్షల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. రైతుల రుణమాఫీ కోసం ఇప్పటికే రూ.18.5వేల కోట్లను బ్యాంకులకు జమ చేశామన్నారు.
Updated Date - Aug 22 , 2024 | 03:31 AM