Bhatti: కాంగ్రెస్ కూటమి గెలుపుతోనే రాజ్యాంగ పరిరక్షణ
ABN, Publish Date - Nov 03 , 2024 | 03:50 AM
ఝార్ఖండ్ రాష్ట్రంతో పాటుగా దేశంలో రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల గెలుపు అనివార్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
ఝార్ఖండ్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి
హైదరాబాద్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి) : ఝార్ఖండ్ రాష్ట్రంతో పాటుగా దేశంలో రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ కూటమి అభ్యర్థుల గెలుపు అనివార్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఝార్ఖండ్ ఎన్నికలకుగాను ఏఐసీసీ పరిశీలకుని హోదాలో ఆ రాష్ట్రంలో పర్యటిస్తున్న భట్టి విక్రమార్క.. శనివారంనాడు రాంఘడ్ నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజ్యాంగంలో పొందుపరుచుకున్న లక్ష్యాలు అందరికీ అందుబాటులోకి రావాలంటే కాంగ్రెస్ పార్టీ కూటమి అభ్యర్థుల గెలుపు కీలకమని సూచించారు. ఇంటింటి ప్రచారం, బూత్ స్థాయి సమావేశాల ఏర్పాటు, సోషల్ మీడియాలో ప్రచారం వంటి అంశాలపై స్థానిక బ్లాక్ కాంగ్రెస్ నేతలకు తగు సూచనలు చేశారు.
Updated Date - Nov 03 , 2024 | 03:50 AM