TS Politics: యాదగిరిగుట్టలో కింద కూర్చోవడానికి కారణమిదే: భట్టి విక్రమార్క
ABN, Publish Date - Mar 12 , 2024 | 03:52 PM
యాదగిరి గుట్ట (Yadagirigutta) లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిన్న(సోమవారం) పర్యటించారు. ఆలయంలో ప్రత్యేక పూజల నిమిత్తం సీఎం రేవంత్ దంపతులు, నల్లొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ బల్లాపై కూర్చున్నారు. అయితే బల్లాపై ప్లేస్ లేకపోవడంతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) ఓ చిన్న స్టూల్ మీద కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
హైదరాబాద్: యాదగిరి గుట్ట (Yadagirigutta) లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిన్న(సోమవారం) పర్యటించారు. ఆలయంలో ప్రత్యేక పూజల నిమిత్తం సీఎం రేవంత్ దంపతులు, నల్లొండ జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓ బల్లాపై కూర్చున్నారు. అయితే బల్లాపై ప్లేస్ లేకపోవడంతో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) ఓ చిన్న స్టూల్ మీద కూర్చున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ విషయాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. భట్టికి అవమానం జరిగిందంటూ ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ విషయంపై భట్టి విక్రమార్క స్పందించారు.
ఆ ఫొటోతో కావాలని ప్రతిపక్షాలు ట్రోల్ చేస్తున్నాయని భట్టి విక్రమార్క మండిపడ్డారు. తాను కావాలనే చిన్న స్టూల్ మీద కూర్చున్నానని భట్టి చెప్పారు. తాను ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని శాసిస్తున్నానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ నిర్వహిస్తూ రాష్ట్రంలో కీలక నిర్ణయాల్లో భాగస్వామిగా ఉన్నానని తెలిపారు. తాను ఎవరికీ తలవంచే వాడిని కాదని ఎవరో పక్కన కూర్చోబెడితే కూర్చునే వాడిని కాదని వివరించారు. ఆత్మ గౌరవాన్ని చంపుకునే మనస్తత్వం తనది కాదని భట్టి విక్రమార్క తెలిపారు.
ఇవి కూడా చదవండి
CM Revanth Reddy: పదో తరగతి పరీక్షలపై రేవంత్ సీరియస్.. జామర్లతో సిగ్నల్స్ ఆఫ్ చేయిస్తారట..
Kishan Reddy: పార్లమెంట్ ఎన్నికలపై కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Updated Date - Mar 12 , 2024 | 05:00 PM