ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Adilabad:మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత

ABN, Publish Date - Jun 29 , 2024 | 01:15 PM

బీజేపీ నేత, మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ తీవ్ర అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన వయస్సు 58 సంవత్సరాలు. శనివారం ఉదయం ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా.. మార్గమధ్యంలో ఆయన మరణించారు.

ఆదిలాబాద్, జూన్ 29: హైదరాబాద్, జూన్ 29: బీజేపీ నాయకుడు, ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ శనివారం కన్నుమూశారు. ఆయన వయస్సు 58 సంవత్సరాలు. ఇటీవల ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆయన ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అనంతరం రెండు రోజుల క్రితమే రామేశ్ రాథోడ్ ఆదిలాబాద్ చేరుకున్నారు.


అయితే శనివారం ఉదయం ఆయన ఆరోగ్యం విషమించింది. దాంతో మెరుగైన చికిత్స కోసం కుటుంబసభ్యులు ఆయన్ని హైదరాబాద్ తరలిస్తుండగా ఆయన మరణించినట్లు తెలుస్తుంది. రమేష్ రాథోడ్ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి, ఎన్ చంద్రబాబు నాయుడుతోపాటు కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ సంతాపం తెలిపారు. రమేశ్ రాథోడ్ అంత్యక్రియలు ఆదివారం నిర్వహించనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Latest Telugu News And National News


ఖానాపూర్ ఎమ్మెల్యేగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గానే కాకుండా లోక్‌సభ సభ్యుడిగా రమేష్ రాథోడ్ పని చేశారు. తెలుగుదేశం, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల్లో రమేశ్ రాథోడ్ కీలక నేతగా పని చేశారు. ఆయన స్వస్థలం నార్నూర్ మండలం తాడిహాత్నూర్.

Updated Date - Jun 29 , 2024 | 07:11 PM

Advertising
Advertising