కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటే: ఎంపీ రఘునందన్
ABN, Publish Date - Nov 26 , 2024 | 04:04 AM
కేసీఆర్ సర్కారు హయాంలో మల్లన్నసాగర్ రైతులపై దాడులు చేయించి కేసులు పెట్టించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు గిరిజన రైతుల కోసం పోరాడటం విడ్డూరంగా ఉందని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ఎద్దేవా చేశారు.
న్యూఢిల్లీ, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ సర్కారు హయాంలో మల్లన్నసాగర్ రైతులపై దాడులు చేయించి కేసులు పెట్టించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు గిరిజన రైతుల కోసం పోరాడటం విడ్డూరంగా ఉందని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు ఎద్దేవా చేశారు. వంద ఎలుకలను తిన్న పిల్లి పాపప్రక్షాళన కోసం కాశీకి వెళ్లినట్టుగా.. కేటీఆర్, బీఆర్‌ఎస్ తీరు ఉందన్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒక్కటేనని, ఈ రెండు పార్టీలూ నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టు చెయ్ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలో తెచ్చిన భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా లగచర్ల రైతులను వేధించడం ఎంతవరకు సబబు అని సీఎం రేవంత్‌ను ప్రశ్నించారు.
Updated Date - Nov 26 , 2024 | 04:04 AM