ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

N Convention: ఎన్ కన్వెన్షన్ విషయంలో హైకోర్టు స్టే ఇవ్వడమేంటి..!?

ABN, Publish Date - Aug 24 , 2024 | 04:08 PM

టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను హైడ్రా బృందం కూల్చివేసిన ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మూడున్నర ఎకరాలు తుమ్మడి చెరువును కబ్జా చేసి కన్వెన్షన్‌ను నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన హైడ్రా నేలమట్టం చేసింది..

హైదరాబాద్‌: టాలీవుడ్ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను (N Convention) హైడ్రా బృందం కూల్చివేసిన ఘటన ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. మూడున్నర ఎకరాలు తుమ్మడి చెరువును కబ్జా చేసి కన్వెన్షన్‌ను నిర్మించారని అధికారులకు ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన హైడ్రా నేలమట్టం చేసింది. ఈ క్రమంలో హైకోర్టును (High Court) ఆశ్రయించడంతో నాగార్జునకు (Akkineni Nagarjuna) భారీ ఊరట లభించింది. ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేతలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. కూల్చివేతలను ఆపేయాలని హైకోర్టు శనివారం నాడు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులపై బీజేపీ ఎంపీ రఘునందనరావు స్పందించారు.


సుప్రీంకోర్టు.. హైకోర్టు ఏం చెప్పాయి..!?

గౌరవ న్యాయ మూర్తులకు విజ్ఞప్తి.. లంచ్ మోషన్ అని.. ఆగం ఆగం కేసులు వినకండి. ఒక్క బిల్డింగ్ కూలిపోతే ఏమవుతుంది..?. 2007, 2008లో చెరువుల కాపాడాలని ఆంద్రప్రదేశ్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. చెరువులో నిర్మాణాలు ఉంటే ఎలాంటి నోటిసులు ఇవ్వకుండా కూల్చాలని సుప్రీంకోర్టు చెప్పింది. మళ్ళీ జడ్జీలు స్టే ఇచ్చుడు ఏంది..? పిల్లలు నాలల కొట్టుకోపోతే ఏం చేశారు..?. డీ మార్కు చేసిన అనుమతులు లేకుండా కట్టిన నిర్మాణలను కూల్చివేయాలని హైకోర్టు చెప్పింది. ఒక్కసారి హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత మళ్ళీ హైకోర్టు జడ్జిలు చేయబడమేంటి..?. దయచేసి హైకోర్టు జడ్జిలు కూడా హైదరాబాద్ చెరువుల పరిరక్షణకు సహకరించాలి అని న్యాయస్థానానికి రఘునందనరావు విజ్ఞప్తి చేశారు.


అన్నీ కూల్చేయండి..!

బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు డ్రామాలు రక్తికట్టించేలా మాట్లాడుతున్నారు. 1994కోట్ల విజయభాస్కర్ రెడ్డి హయాంలో మిరాలం చెరువు కబ్జాపై స్పందించారు. 2010 లో ఎఫ్టీఎల్, శిఖంలలో ఎవరు ఏం కట్టినా కూల్చివేయాలని కోర్టు చెప్పింది. 157జీవోను 6 /4 2010లో ప్రభుత్వం తీసుకుని వచ్చింది. 18మందితో లేక్ ప్రొటెక్షన్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు మీరాలం ట్యాంక్ పరిస్థితి ఏంటో రేవంత్ రెడ్డి చెప్పాలి?. ఎన్ కన్వెన్షన్‌ను 2014లో కూల్చివేయమని హైకోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి ఎందుకు చర్యలు తీసుకోలేదో చెప్పాలి..? ఎన్ కన్వెన్షన్ వెనుక ఉన్న లాలూచీ ఏంటో కేటీఆర్ చెప్పాలి. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా అధికారులతో కలిపి అధికారుల కమిటీ వేశారు. ముందు కేటీఆర్ జన్వాడా ఫాం హౌస్ కూల్చి వేయండి. కవిత, కేటీఆర్ ఫాం హౌస్‌ను కూల్చేందుకు ఎందుకు భయపడుతున్నారు. హైడ్రా వేసింది మంచి ఉద్దేశ్యంతో అయితే బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కట్టడాలు కూల్చి వేయాలి. కబ్జాలను పాల్పడిన నేతలపై కేసులు పెడితే వారిని ఎందుకు అరెస్టు చేయలేదు. రాజ్ భవన్ రోడ్‌లో నాలాలపై ఆసుపత్రి కట్టారు.. భారీ భవనాలను నిర్మించారు. చెరువుల ఆక్రమణలపై చర్యలు తీసుకోని కేటీఆర్‌ను మొదటి ముద్దాయిగా అరెస్టు చేయాలిఅని రఘునందన్ డిమాండ్ చేశారు.

Updated Date - Aug 24 , 2024 | 04:20 PM

Advertising
Advertising
<