ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

KCR: కేసీఆర్‌పై కొద్దిసేపటి క్రితం ఈడీ కేసు నమోదు: ఎంపీ రఘునందన్ రావు

ABN, Publish Date - Jun 13 , 2024 | 04:03 PM

మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితం మాజీ సీఎం కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు చేసిందని అన్నారు. కేసీఆర్ కోసం కొద్దిసేపటి క్రితం కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని వ్యాఖ్యానించారు.

హైదరాబాద్: మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్దిసేపటి క్రితం మాజీ సీఎం కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదు చేసిందని అన్నారు. కేసీఆర్ కోసం కొద్దిసేపటి క్రితం కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని వ్యాఖ్యానించారు. తన సన్మాన సభలో ఎంపీ రఘునందన్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. జీవిత కాలం మెదక్ ప్రజలకు రుణపడి ఉంటానని, రఘునందన్ అంటే మాటల మనిషి కాదు..చేతల మనిషి అని ఆయన అన్నారు. పైసలు, మందు ఓపెన్‌గా పంచినా ఓడిపోయారని ఎన్నికలను ప్రస్తావించారు. వెంకట్రామిరెడ్డి వెయ్యి కోట్లు పెడితే వాటిని లెక్కచేయకుండా గెలిచానని, రాజకీయాల్లో రాణించాలంటే ఆత్మ విశ్వాసం ఉండాలని ఆయన వ్యాఖ్యానించారు.


కేసీఆర్, హరీష్ రావు, వెంకట్రామిరెడ్డిలకు ముందుంది ముసళ్ళ పండుగ అని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. ‘‘ సిద్ధిపేటలో హరీష్ రావు ఉండగా...ఎస్కార్ట్‌లో ఆయన ఉన్న మీటింగ్‌కి ఇంకొకరు వస్తారని హరీష్ రావు కూడా ఊహించలేదు. దుబ్బాకలో దెబ్బ కొట్టిన అని ఆరడుగుల హరీశ్ ఎగిరిండు. యుద్ధం మొదలు పెట్టాక గెలిచేవరకు ఒదిలిపెట్టొద్దు. లక్ష్యాన్ని నిర్దేశించుకొని క్యాడర్‌తో కలిసి ముందుకు సాగాలి. జనం గుండెల్లో ఉన్నాం కాబట్టి గెలిచాం’’ అని రఘునందన్ రావు అన్నారు.

Updated Date - Jun 13 , 2024 | 04:10 PM

Advertising
Advertising