ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Raghunandan Rao: అవినీతిపరులను అరెస్టు చేస్తే స్వాగతిస్తాం

ABN, Publish Date - Oct 31 , 2024 | 04:34 AM

అవినీతిపరులను అరెస్టు చేస్తే బీజేపీ స్వాగతిస్తుందని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. బీఆర్‌ఎస్‌ స్థానంలోకి బీజేపీ వెళ్లే ప్రసక్తేలేదని, బీఆర్‌ఎ్‌సకు ప్రజలు సీ స్థానం ఇచ్చారని పేర్కొన్నారు.

  • కేసీఆర్‌లాగే సీఎం రేవంత్‌ మూసీని అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు: ఎంపీ రఘునందన్‌రావు

హైదరాబాద్‌, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): అవినీతిపరులను అరెస్టు చేస్తే బీజేపీ స్వాగతిస్తుందని మెదక్‌ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. బీఆర్‌ఎస్‌ స్థానంలోకి బీజేపీ వెళ్లే ప్రసక్తేలేదని, బీఆర్‌ఎ్‌సకు ప్రజలు సీ స్థానం ఇచ్చారని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మీడియా స మావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ప్ర జలు గుండెల్లో పెట్టుకుంటారని చెప్పారు. కేసీఆర్‌ ఇక ఫాం హౌస్‌లకే పరిమితమవుతారని, కేటీఆర్‌ రేవ్‌ పార్టీలని తిరుగుతున్నారని విమర్శించారు.


గ్రామ పంచాయతీల్లో విద్యుత్తు బిల్లులు చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. గ్రామసభలు పెట్టకుండా కాంగ్రెస్‌ నాయకులు చెప్పిన వారినే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలో చేరుస్తున్నారని ఆరోపించారు. దీనిపై కోర్టుకు వెళ్తామని చెప్పారు. రేవంత్‌ కూడా ఆంధ్రా కంపెనీలకే కాంట్రాక్టులు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి వసూళ్లు జరుగుతున్నాయని, పాలన సక్రమంగా సాగడంలేదని ఆరోపించారు.

Updated Date - Oct 31 , 2024 | 04:34 AM