ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

LokSabha Elections: కేసీఆర్ బస్సు యాత్రకు అనుమతి ఇవ్వండి

ABN, Publish Date - Apr 19 , 2024 | 08:10 PM

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సమయంలో సమీస్తుంది. ఆ క్రమంలో ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సైతం ప్రచారం కోసం రంగంలోకి దిగుతుంది. అందులోభాగంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ బస్సుయాత్రకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆ పార్టీ నేతలు కోరారు.

KCR

హైదరాబాద్, ఏప్రిల్ 19: తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌కు సమయంలో సమీస్తుంది. ఆ క్రమంలో ఇప్పటికే పలు రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ సైతం ప్రచారం కోసం రంగంలోకి దిగుతుంది.

అందులోభాగంగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ బస్సుయాత్రకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆ పార్టీ నేతలు కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఎన్నికల కమిషన్ సీఈవో వికాస్ రాజ్‌ను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డా.కేతిరెడ్డి వాసుదేవరెడ్డి కలిశారు.

Loksabha Elections: ఖమ్మం రోడ్‌ షోలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్ కీలక వ్యాఖ్యలు

ఈ సందర్భంగా లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏప్రిల్ 22వ తేదీ నుంచి మే 10వ తేదీ వరకు కేసీఆర్ యాత్ర వివరాలను ఈసీ సీఈవోకు అందజేశారు. అయితే ఎన్నికల సందర్భంగా అధికారులంతా ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తారు. ఈ నేపథ్యంలో కేసిఆర్ యాత్రకు కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Seethakka: మోదీ ప్రభుత్వంలో భారత రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోంది

అలాగే యాత్రలో పోలీసు సహకారం సైతం అందేలా ఆదేశాలు ఇవ్వాలని సీఈవోకు ఇచ్చిన వినతి పత్రంలో స్పష్టం చేశారు. అలాగే కేసిఆర్ వెంట 25 వాహనాల్లో ముఖ్య నేతల ర్యాలీ ఉంటుందని.. అందుకు సైతం అనుమతి ఇవ్వాలని అభ్యర్థించారు.

తెలంగాణ వార్తలు కోసం..

Updated Date - Apr 19 , 2024 | 08:13 PM

Advertising
Advertising