Share News

Kalvakuntla Kavitha:పైసల కోసం వెళ్లినోడు నాయకుడా?

ABN , Publish Date - Dec 15 , 2024 | 01:08 PM

ల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది.

Kalvakuntla Kavitha:పైసల కోసం వెళ్లినోడు నాయకుడా?

జగిత్యాల, డిసెంబర్ 15: పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన స్థానిక ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. కేసీఆర్ బొమ్మతో గెలిచిన సంజయ్ కుమార్.. కాంగ్రెస్ పార్టీలో చేరారని విమర్శించారు. ఏ మొహం పెట్టుకుని వెళ్లావంటూ సంజయ్‌ కుమార్‌ను ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. ఆదివారం జగిత్యాలలో ఎమ్మెల్సీ కవిత పర్యటించారు.

Also Read: జమిలి ఎన్నికల బిల్లుపై వెనక్కి తగ్గిన కేంద్రం


ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మాట్లాడుతూ.. నియోజకర్గ అభివృద్ధికి ఏడాది నుంచి ఒక్క రూపాయి సైతం తేలేదని ఆరోపించారు. అయినా ఎందుకు పార్టీ వీడి వెళ్లావంటూ జగిత్యాల ఎమ్మెల్యేను ఆమె సూటిగా ప్రశ్నించారు. ప్రజలను వదిలి.. పైసల కోసం వెళ్లినోడు నాయకుడా? అంటూ సంజయ్ కుమార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తట్టేడు మట్టి తీయ్యలేదు.. అసెంబ్లీకి ఏ మొహం పెట్టుకుని పోతావంటూ ఎమ్మెల్యే సంజయ్‌పై నిప్పులు చెరిగారు.

Also Read: కేసీఆర్ ఫ్యామిలీ నాటకం.. యువత బలిదానాలకు కారణం


గతేడాది.. అంటే 2023 చివరిలో తెలంగాణ అసెంబ్లీకి జరిగి ఎన్నికల్లో తెలంగాణ ఓటరు.. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొలువు తీరింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టారు. దీంతో బీఆర్ఎస్ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలతోపాటు అగ్రనాయకులు సైతం కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. అందులో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సైతం ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.

Also Read: మోహన్‌బాబు ఎపిసోడ్‌లో బిగ్ ట్విస్ట్


మరోవైపు.. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆమెను ఢిల్లీలోని తీహాడ్ జైలుకు తరలించారు. కొన్ని నెలల పాటు ఆమె ఆ జైల్లోనే ఉన్నారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు. అలా విడుదలైన ఆమె చాలా కాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఎవరిపైనా.. ఏ రాజకీయ పార్టీపైన ఆమె ఆరోపణలు సంధించలేదు. అలాంటి వేళ చాలా రోజుల తర్వాత.. ఆదివారం జగిత్యాలలో పర్యటించారు.

Also Read: నేడు నాగపూర్‌కు సీఎం, డిప్యూటీ సీఎం

For Telangana News and Telugu News

Updated Date - Dec 15 , 2024 | 01:12 PM