ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG News: అధిక వడ్డీ ఆశ చూపి.. రూ.500 కోట్లు వసూలు చేసి కేటుగాళ్లు పరార్..

ABN, Publish Date - Sep 05 , 2024 | 10:11 AM

జనాల్లో ఆశ చావనంత వరకూ నేరగాళ్లు పెరుగుతూనే ఉంటారు. బోగస్ సంస్థలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అధిక వడ్డీల పేరు చెప్పగానే ఇంకేంముందని ఉన్నదంతా ఊడ్చి మరీ పెట్టుబడి పెట్టారు.

హైదరాబాద్: జనాల్లో ఆశ చావనంత వరకూ నేరగాళ్లు పెరుగుతూనే ఉంటారు. బోగస్ సంస్థలు పుట్టుకొస్తూనే ఉంటాయి. అధిక వడ్డీల పేరు చెప్పగానే ఇంకేంముందని ఉన్నదంతా ఊడ్చి మరీ పెట్టుబడి పెట్టారు. ముందుగా నమ్మించేందుకు సక్రమంగా కొద్ది నెలల పాటు వడ్డీలు చెల్లించింది సంస్థ. ఇంకేముంది.. వాళ్లు మునిగింది కాక.. మరికొందరిని ముంచేశారు. మరికొందరికి చెప్పి అధిక వడ్డీలు వస్తాయని నమ్మబలికి వారితోనూ పెట్టుబడులు పెట్టించారు. ఇక అంతే అందరి డబ్బూ తీసుకుని సంస్థ నిర్వాహకులు రాత్రికి రాత్రే బిచానా ఎత్తేశారు. ఇప్పుడు లబోదిబోమంటూ పోలీసులను బాధితులంతా కలిసి ఆశ్రయించారు.


హైదరాబాద్‌లో ఇన్‌వెస్ట్‌మెంట్స్ పేరుతో భారీ మోసం జరిగింది. డీకేజెడ్ టెక్నాలజీస్ పేరుతో ఒక కంపెనీ హైదరాబాద్‌లో ఏర్పాటైంది. కంపెనీలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీలు ఇస్తామని ప్రచారం కంపెనీ ప్రతినిధులు ప్రచారం నిర్వహించారు. అధిక వడ్డీ అనేసరికి జనాలకు ఎక్కడ లేని ఆశ పుట్టుకొచ్చింది. దీంతో కంపెనీకి ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.500 కోట్ల వరకూ ముట్ట జెప్పారు. జనాలను నమ్మించేందుకు మొదట ఎవరైతే పెట్టుబడి పెట్టారో వాళ్లందరికీ వడ్డీ రూపంలో నిర్వాహకులు డబ్బు చెల్లించారు. ప్రతి నెల వడ్డీలు తిరిగి చెల్లిస్తుండడంతో ఇక తమకు తెలిసిన వారందరికీ చెప్పి.. వేల మందితో తొలుత పెట్టుబడి పెట్టిన వారంతా పెట్టుబడులు పెట్టించారు.


మొత్తంగా జనాల నుంచి సంస్థ రూ.500 కోట్లు వసూలు చేసింది. ఇంకెందుకు అక్కడ ఉంటుంది. బిచానా ఎత్తేసింది. గత రెండు నెలల నుంచి తిరిగి డబ్బులు చెల్లించకపోవడంతో కంపెనీ నిర్వాహకులను బాధితులు నిలదీశారు. అంతే.. మాదాపూర్‌లోని ఆఫీస్‌కి తాళం వేసి నిందితులు రాత్రికి రాత్రి పరారయ్యారు. బాధితులు మోసపోయామని తెలుసుకొని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మహమ్మద్ ఇక్బాల్, రాహిల్, డీకేజెడ్ సంస్థను నిర్వహిస్తున్నారు. నిత్యవసర వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, స్టోర్స్ ద్వారా ఈ కామర్స్ రూపంలో విక్రయిస్తున్నామంటూ నిందితులు ప్రచారం చేశారు. వీరి ప్రచారం నిజమేనని నమ్మి వేల సంఖ్యలో జనం పెట్టుబడులు పెట్టారు.

Updated Date - Sep 05 , 2024 | 10:11 AM

Advertising
Advertising