ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థుల సంరక్షణ అందరి బాధ్యత

ABN, Publish Date - Dec 22 , 2024 | 01:36 AM

గురుకులాల్లోని విద్యార్థులు సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని మెట్‌పల్లి సీనియర్‌ సివి ల్‌ జడ్జి, మండల లీగల్‌ సర్వీస్‌ కమిటీ చైర్మన్‌ నాగేశ్వర్‌రావు అన్నారు. శనివారం మండలంలోని పెద్దాపూర్‌ గురుకుల బాలురు, పాఠశాల, కళాశాలను తనిఖీ చేశారు.

మెట్‌పల్లి సీనియర్‌ సివిల్‌ జడ్జి నాగేశ్వర్‌రావు

మెట్‌పల్లి రూరల్‌, డిసెంబర్‌, 21 (ఆంధ్రజ్యోతి) : గురుకులాల్లోని విద్యార్థులు సంరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని మెట్‌పల్లి సీనియర్‌ సివి ల్‌ జడ్జి, మండల లీగల్‌ సర్వీస్‌ కమిటీ చైర్మన్‌ నాగేశ్వర్‌రావు అన్నారు. శనివారం మండలంలోని పెద్దాపూర్‌ గురుకుల బాలురు, పాఠశాల, కళాశాలను తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతకు గురైనా కారణాలు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. వంటశాలను పరిశీలించి స్టోర్‌ రూమ్‌లోని నిత్యావసర వస్తువులను పరిశీలించారు. బాత్‌ రూమ్‌ లను పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తుండాలని, పరిసరాలను శు భ్రంగా ఉంచాలన్నారు. విద్యార్థులకు ఆరోగ్య సమస్యలను పరిష్కరించడా నికి అనుభవజ్ఞులైన స్టాప్‌ నర్సును ఎప్పుడు అందుబాటులో ఉండేలా చ ర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత నాలుగు నెలల నుంచి వరుసగా జరిగిన ఘటనలతో ఇద్దరు విద్యార్థులు మృతి చెందడం, నలుగురు అస్వస్థతకు గురికావడం కలిచివేసిందన్నారు. వరుస ఘటనలపై సమగ్ర విచారణ చేపట్టి, జిల్లా లీగల్‌ సర్వీస్‌ కమిటీతో పాటు రాష్ట్ర కమిషనర్‌కు రిపోర్టు సమర్పిస్తామన్నారు. విద్యార్థులకు రక్షణ కల్పించేందుకు స్పందించి కలెక్టర్‌ తీసుకుంటున్న చర్యలు బాగున్నాయ న్నారు. విద్యార్థుల విద్యాభసనానికి ఆటంకం కలుగకుండా జాగ్రత్తలు తీ సుకోవాలన్నారు. తల్లిదండ్రులను విడిచి పెట్టి తమ వద్ద ఉన్న వారిని స్వంత బిడ్డల్లాగ చూసుకోవాలన్నారు. విద్యార్థుల పట్ల ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దని పలు సూచలను చేశారు. ఈయన వెంట మెట్‌పల్లి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పుప్పాల లింబాద్రి, ఉపాధ్యాక్షుడు వెల్ముల రాం బాబు, వడ్డేపల్లి శ్రీనావాస్‌, వెంకట్‌నర్సయ్య, న్యాయవాదులు, కమిటీ సభ్యులు ఉన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 01:36 AM