ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Relief Fund: సీఎం సహాయనిధికి చిరంజీవి విరాళం

ABN, Publish Date - Sep 17 , 2024 | 02:43 AM

వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయనిధికి పలువురు ప్రముఖులు తమ వంతుగా సాయం అందించారు.

  • రూ. కోటి ఇచ్చిన మాజీ మంత్రి గల్లా అరుణ

  • చెరో రూ. 10 లక్షలిచ్చిన సాయిదుర్గా తేజ్‌, విశ్వక్‌సేన్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయనిధికి పలువురు ప్రముఖులు తమ వంతుగా సాయం అందించారు. సోమవారం మెగాస్టార్‌ చిరంజీవితో పాటు ఆయన తనయుడు రామ్‌చరణ్‌ రూ.కోటి విరాళంగా ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్కులను జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్‌రెడ్డిని కలిసి చిరంజీవి అందజేశారు. అమర్‌రాజా గ్రూప్స్‌ తరఫున మాజీ మంత్రి గల్లా అరుణకుమారి తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.కోటిని ప్రకటించి సంబంధిత చెక్కును సీఎం రేవంత్‌రెడ్డికి అందజేశారు.


అదే విధంగా తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన నటులు సాయిదుర్గా తేజ రూ.10లక్షలు, విశ్వక్‌సేన్‌ రూ.10లక్షలను రేవంత్‌కు అందించగా.. విశ్వక్‌సేన్‌ వెంట వరంగల్‌ ఎంపీ కడియం కావ్య ఉన్నారు. ఇక ప్రముఖ హాస్య నటుడు అలీ రూ.3లక్షలు, గరుడపల్లి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరక్టర్‌ సంజయ్‌ గరుడపల్లి రూ.25లక్షలు, మాజీ ఎంపీ రాజమోహన్‌ రెడ్డి రూ.25లక్షలు, డైటీషియన్‌ వినీల రూ.10లక్షల విరాళాన్ని ప్రకటించి చెక్కులను సీఎంకు అందించారు. కాగా, మొత్తంగా సోమవారం సీఎంఆర్‌ఎ్‌ఫకు రూ.2.83 కోట్ల విరాళాలు అందాయి.

Updated Date - Sep 17 , 2024 | 02:43 AM

Advertising
Advertising