Kishan Reddy: జితేందర్ రెడ్డి సినిమాలో ఆ సీన్ ఎప్పటికి మరిచిపోలేను:
ABN, Publish Date - Nov 11 , 2024 | 10:09 PM
దివంగత నాయకుడు జితేందర్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి కరుడుగట్టిన జాతీయవాది అని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. వారి కుటుంబమంతా గొప్ప జాతీయ భావజాలంతో పని చేసిందని వివరించారు. పొరుగునున్న ఏపీలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో ఆయన కీలక బాధ్యతలు చేపట్టారని చెప్పారు.
హైదరాబాద్, నవంబర్ 11: తుపాకీ బుల్లెట్ కంటే ఓటు బుల్లెట్టే ప్రధానమని భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సూచిన మార్గంలోనే సమాజంలో మార్పు రావాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆకాంక్షించారు. సోమవారం హైదరాబాద్‌లో జితేందర్ రెడ్డి చిత్రాన్ని ఆయన వీక్షించారు. అనంతరం కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. జితేందర్ రెడ్డికి ప్రాణహాని ఉందని తెలిసినా అతడి బాటను ఆయన తండ్రి ఎప్పుడూ అడ్డుకో లేదని చెప్పేవారన్నారు.
Also Read: AP High Court: జగన్ పిటిషన్ విచారణ.. మళ్లీ వాయిదా
దివంగత నాయకుడు జితేందర్ రెడ్డి తండ్రి మల్లారెడ్డి కరుడుగట్టిన జాతీయవాది అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. వారి కుటుంబమంతా గొప్ప జాతీయ భావజాలంతో పనిచేసిందని వివరించారు. పొరుగునున్న ఏపీలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌లో ఆయన కీలక బాధ్యతలు చేపట్టారని చెప్పారు. ధర్మం కోసం 72 బుల్లెట్ల దాడిలో మరణించిన గొప్ప పోరాట యోధుడు జితేందర్ రెడ్డి అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read: ఏపీకి భారీగా పెట్టుబడులు.. యూత్‌కు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్
Also Read: ఢిల్లీకి సీఎం రేవంత్..
ఆయన సోదరుడు ముదుగంటి రవీందర్ చాలా సాహసం చేసి ఈ జితేందర్ రెడ్డి చిత్రాన్ని తెరకెక్కించారన్నారు. దర్శకుడు విరంచి సైతం ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచి.. ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారని తెలిపారు. జితేందర్ రెడ్డి నిజ జీవితం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారని చెప్పారు. గొప్ప నాయకుడు అయిన జితేందర్ రెడ్డి.. నక్సల్స్‌తో పోరాటంలో వీరమరణం పొందారన్నారు. ఈ చిత్రంలో హీరోగా నటించిన రాకేష్‌తోపాటు దర్శకుడు విరంచిని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. ఈ చిత్రాన్ని నక్సలైట్లు సైతం చూడాలన్నారు.
Also Read: AP Politics: విజయవాడలో వైసీపీకి గట్టి షాక్
ఒక వ్యక్తికి జీవం పోసే శక్తి మనకు భగవంతుడు ఇవ్వనప్పుడు.. ఏ వ్యక్తి ప్రాణాన్ని తీసే అధికారం కానీ.. హక్కు కానీ ఎవ్వరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. వేలాది మంది పోలీసులను నక్సలైట్లు హత్య చేశారని.. అలాగే అమాయకులైన గిరిజన ప్రజలను సైతం వారు హత్య చేస్తున్న పరిస్థితి ఉందన్నారు. మారుతున్న వ్యవస్థలో హింస, తుపాకుల ద్వారా ఏం సాధ్యం కాదనే విషయం ప్రజలు సైతం అర్థం చేసుకున్నారన్నారు.
Also Read: ఆర్కే రోజాకు మంత్రి సవిత చురకలు
Also Read: ఏపీలో మారనున్న రహదారుల స్థితిగతులు.. బడ్జెట్‌లో క్లారిటీ
గతంలో ఎన్నికలను బహిష్కరించాలని నక్సలైట్లు పిలుపునిచ్చేవారని గుర్తు చేశారు. కానీ నేడు జమ్ము కశ్మీర్‌లో కూడా 70 నుంచి 80 శాతం మేర ఎన్నికల్లో పోలింగ్ జరుగుతున్నదన్నారు. తద్వారా బుల్లెట్ కంటే బ్యాలెట్టే గొప్పదని ప్రజలు సైతం విశ్వసిస్తున్నారన్నారు. అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగానికి లోబడి పేదలు, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు, రైతులకు, రైతు కూలీలకు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉంచి సేవ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇప్పటికైనా నక్సలైట్లు హింసను వదిలిపెట్టి ప్రజాస్వామ్యంలోకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
Also Read: పులివెందుల పౌరుషం ఉంటే.. రా చూసుకుందాం
Also Read: వచ్చే నెల నుంచి మహిళలకు ఫ్రీ బస్సు..
For Telangana News And Telugu News
Updated Date - Nov 11 , 2024 | 10:10 PM