ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: కోమాలో ఉన్న వలస కార్మికుడి వైద్యానికి ముఖ్యమంత్రి సాయం

ABN, Publish Date - Nov 04 , 2024 | 05:12 AM

కోమాలో ఉన్న వ్యక్తి వైద్యానికి సీఎం సాయం అందించారు. ఖతార్‌లో పనిచేస్తున్న నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండలం నాగంపేటకు చెందిన బదనపల్లి సాయన్న తీవ్ర అనారోగ్యంతో కోమాలోకి వెళ్లాడు.

  • పది నెలలుగా ఖతార్‌లో చికిత్స

  • హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించిన కంపెనీ

  • కుటుంబం విజ్ఞప్తితో స్పందించిన సీఎం.. నిమ్స్‌లో అడ్మిషన్‌కు చొరవ

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): కోమాలో ఉన్న వ్యక్తి వైద్యానికి సీఎం సాయం అందించారు. ఖతార్‌లో పనిచేస్తున్న నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌ మండలం నాగంపేటకు చెందిన బదనపల్లి సాయన్న తీవ్ర అనారోగ్యంతో కోమాలోకి వెళ్లాడు. పది నెలలుగా ఖతార్‌లోని ఆసుపత్రిలో ఉన్న అతడిని కుటుంబసభ్యులు, ఆత్మీయుల సమక్షంలో ఉంటే పరిస్థితి మెరుగు పడవచ్చనే ఉద్దేశంతో కంపెనీ యాజమాన్యం శుక్రవారం ఖతార్‌ నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించింది. అయితే తమకు ప్రైవేటులో చికిత్స అందించే ఆర్థిక స్థోమత లేదని సాయం చేయాలని సాయన్న భార్య, పిల్లలు సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి చేశారు.


సీఎం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ జీఏడీ ఎస్‌.వెంకట్రావు, సెక్షన్‌ ఆఫీసర్‌ చిట్టిబాబుకు ఆదేశించారు. వారు వెంటనే సాయన్నకు నిమ్స్‌లో అడ్మిషన్‌కు అనుమతి మంజూరు చేయించారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల గల్ఫ్‌ తదితర దేశాలలో పనిచేసే ప్రవాసీ కార్మికుల పేర్లు రేషన్‌ కార్డుల నుంచి తొలగించడంతో వారికి ఆరోగ్యశ్రీ పథకం వర్తించడం లేదని కాంగ్రెస్‌ ఎన్నారై సెల్‌ కన్వీనర్‌ మంద భీంరెడ్డి అన్నారు. అచేతన స్థితిలో ఉన్న పేద వలస కార్మికుడు సాయన్నను ఆదుకొని నిమ్స్‌లో చికిత్స అందిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Nov 04 , 2024 | 05:12 AM