ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Manda Krishna: వర్గీకరణ అమలుపై రేవంత్‌ మాట తప్పారు

ABN, Publish Date - Oct 04 , 2024 | 03:33 AM

ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్‌రెడ్డి మాట తప్పారని, మరో సారి మాదిగలను మోసం చేశారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు.

  • 9న నిరసన..15న రాష్ట్ర సదస్సు, ఉద్యమ కార్యాచరణ ప్రకటన: మంద కృష ్ణ

పంజాగుట్ట, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్‌రెడ్డి మాట తప్పారని, మరో సారి మాదిగలను మోసం చేశారని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు వర్గీకరణ అమలు చేస్తామని, ఉద్యోగ నియామకాల్లో వెంటనే వర్తింపజేస్తామని చెప్పి.. విస్మరించారని దుయ్యబట్టారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం మంద కృష్ణ మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పును అందరి కన్నా ముందు స్వాగతించింది రేవంతేనని గుర్తు చేశారు.


ప్రస్తుత ఉద్యోగ నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ వర్తింపజేసేందుకు ఆర్డినెన్స్‌ తీసుకొస్తామని చెప్పింది నిజం కాదా? అని ప్రశ్నించారు. 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నల్ల జెండాలతో నిరసన తెలుపుతామని, అదే రోజు హైదరాబాద్‌లోని ట్యాంక్‌ బండ్‌పైనున్న అంబేడ్కర్‌ విగ్రహం నుంచి బషీర్‌బాగ్‌లోని జగ్జీవన్‌రామ్‌ విగ్రహం వరకు ప్రదర్శన చేపడతామని తెలిపారు. ఈ నెల 15న ఎమ్మార్పీఎస్‌, అన్ని అనుబంధ సంఘాల రాష్ట్ర సదస్సు నిర్వహించి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని మంద కృష్ణ మాదిగ తెలిపారు.

Updated Date - Oct 04 , 2024 | 03:33 AM