ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: మహారాష్ట్రలో ఓటమి మోదీకి ముందే తెలిసింది!

ABN, Publish Date - Nov 19 , 2024 | 02:03 AM

మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి ఓడిపోతుందనే విషయం ప్రధాని మోదీకి ముందే తెలిసిపోయిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అందుకే మోదీ మూడు రోజులుగా ప్రచారం చేయకుండా విదేశాలకు వెళ్లి పోయారన్నారు.

  • వీలైతే కేంద్ర కమిటీని పంపండి వివరాలన్నీ ఇస్తా: రేవంత్‌రెడ్డి

  • కాంగ్రెస్‌ హామీలపై ఆరోపణలా?

  • మావి కచ్చితమైన గ్యారెంటీలు..

  • మహారాష్ట్రను విద్రోహాలకు అడ్డాగా మార్చిన మోదీ

  • ఎన్నికల ప్రచారంలో రేవంత్‌

హైదరాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి ఓడిపోతుందనే విషయం ప్రధాని మోదీకి ముందే తెలిసిపోయిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అందుకే మోదీ మూడు రోజులుగా ప్రచారం చేయకుండా విదేశాలకు వెళ్లి పోయారన్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం పుణెలో జరిగిన మీడియా సమావేశంలో, కడెగావ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్‌ మాట్లాడారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో విఫలమైన ప్రధాని మోదీ.. తెలంగాణ, కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లోని కాంగ్రెస్‌ ప్రభుత్వాల హామీల అమలుపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ గ్యారెంటీలంటే కచ్చితమైన గ్యారెంటీలు అని, అవి.. మోదీ గ్యారెంటీల్లా కాదని అన్నారు. కేంద్ర మంత్రితోగానీ, కేంద్ర ఉన్నతాధికారి ఆధ్వర్యంలోగానీ ఒక కమిటీని వేసి తెలంగాణకు పంపిస్తే రాష్ట్రంలో హామీల అమలుపై ఆ కమిటీకి వివరాలు ఇస్తానని చెప్పారు. మోదీ 11 ఏళ్ల పాలనలో చెప్పుకోవడానికి ఒక్క విజయగాఽధ కూడా లేకపోవడంతో ప్రతి ఎన్నికల ముందు బాంబుపేలుళ్లు, ఇతర విషయాలను తెరపైకి తెస్తున్నారని ఆరోపించారు. 2014 ఎన్నికలకు ముందు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని, దేశంలోని ప్రతి పేదవాడికీ ఇల్లు నిర్మిస్తామంటూ నరేంద్రమోదీ హామీ ఇచ్చారని రేవంత్‌ గుర్తు చేశారు. కానీ, చివరికి మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చారన్నారు. దేశంలోనే అత్యధికంగా రైతు ఆత్మహత్యలు మహారాష్ట్రలో చోటుచేసుకుంటున్నాయని, ప్రధాని మోదీ ఈ విషయంపై ఎందుకు మాట్లాడటంలేదని ప్రశ్నించారు.


  • 2 కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయి?

ఏటా 2కోట్ల ఉద్యోగాలని చెప్పిన ప్రధాని మోదీ.. 11 ఏళ్ల పాలనలో అందులో ఒక్క శాతం కూడా ఇవ్వలేదని రేవంత్‌ అన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ఏటా 2 కోట్ల ఉద్యోగాలపై లోక్‌సభలో ప్రశ్న అడిగితే కేవలం కేవలం 7.50 లక్షల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చినట్లుగా మోదీ ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రైతుల ఖాతాల్లో రూ.18 వేల కోట్లు వేసి వారి రుణాలను మాఫీ చేశామని తెలిపారు. 50 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామన్నారు. యూపీఏ హయాంలో సోనియాగాంధీ సూచన మేరకు దీపం పథకం కింద రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌, స్టవ్‌లను అప్పటి ప్రభుత్వం అందజేసిందన్నారు. మోదీ ప్రధాని అయ్యాక రూ.400 సిలిండర్‌ను రూ.12000కు పెంచేశారని, తద్వారా పేద మహిళలు వంటింట్లో దాచుకున్న డబ్బును మోదీ చోరీ చేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో తాము పేద మహిళలకు రూ.500కే సిలిండర్‌ ఇస్తున్నామని తెలిపారు. ప్రధాని మోదీ, బీజేపీ నేతలు హైదరాబాద్‌కు వస్తే సచివాలయంలో కూర్చోబెట్టుకుని తాను చెప్పిన ప్రతి అంశానికీ వివరాలను అందజేస్తానని, ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమాపణలు చెబుతానని ప్రకటించారు. మహారాష్ట్ర ప్రజలు మహా వికాస్‌ అఘాడీని గెలిపిస్తే తెలంగాణలో అమలవుతున్నట్లుగానే ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయని చెప్పారు.


  • కోవర్టు ఆపరేషన్లకు అడ్డాగా మార్చారు..

రాజకీయంగా మహారాష్ట్ర.. దేశంలో రెండో పెద్ద రాష్ట్రమని రేవంత్‌ అన్నారు. అలాంటి రాష్ట్రాన్ని ప్రధాని మోదీ.. కోవర్టు ఆపరేషన్లకు, విద్రోహాలకు అడ్డాగా మార్చారని ఆరోపించారు. ముంబయిలోని ధారావిని కబ్జా చేేసందుకు మోదీకి గులాములు, ద్రోహులైన శిందే, అజిత్‌ పవార్‌, అశోక్‌ చవాన్‌లను వినియోగించుకుంటున్నారని ధ్వజమెత్తారు. మహారాష్ట్ర నేల.. వీరుల నేల అని, ఈ విద్రోహులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రె్‌సలో విభేదాలనేవి బీజేపీ వాట్సాప్‌ యూనివర్సిటీ చేసే తప్పుడు ప్రచారమని రేవంత్‌ అన్నారు. కాగా, గత మూడు రోజులుగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల తరపున మహారాష్ట్రలో విస్తృతంగా ప్రచారం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. సోమవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్నారు.


  • ఇందిరాగాంధీకి సీఎం రేవంత్‌ నివాళి

భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ.. పేదలు, మహిళల అభ్యున్నతికి విశేష కృషి చేశారని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ‘‘భారతీయ శక్తికి మహిళలే ప్రతీకలు’ అన్న ఇందిరాగాంధీ మాటల స్ఫూర్తితో తెలంగాణ ప్రజాప్రభుత్వం మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. సోమవారం ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా రేవంత్‌రెడ్డి ఆమెకు నివాళి అర్పించారు. ఆమె జయంతిని పురస్కరించుకుని నిర్వహించే ‘జాతీయ సమైక్యతా దినోత్సవం’ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇందిర జయంతి రోజునే రాష్ట్రంలో 22 జిల్లాల్లో నూతనంగా నిర్మించే మహిళా శక్తి భవనాలకు భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం గర్వకారణమని సీఎం రేవంత్‌ పేర్కొన్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

Updated Date - Nov 19 , 2024 | 02:03 AM