ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: వేములవాడ ఆలయ విస్తరణకు శృంగేరి పీఠం అనుమతి తీసుకోండి

ABN, Publish Date - Aug 31 , 2024 | 03:56 AM

రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణకు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాలని అధికారులు, అర్చకుల్ని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు.

  • సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, సిరిసిల్ల, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ విస్తరణకు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాలని అధికారులు, అర్చకుల్ని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ఈ ఆలయ విస్తరణకు బడ్జెట్‌లో 50 కోట్ల రూపాయలు కేటాయించినందుకు హైదరాబాద్‌ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసి ప్రభుత్వ విప్‌ అది శ్రీనివాస్‌, ఆలయ అర్చకులు, అధికారులు శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు.


ముఖ్యమంత్రికి రాజన్న ప్రసాదాన్ని అందించడంతో పాటు దేవస్థానం అర్చకులు ఆశీర్వచనాలు అందించారు. దేవస్థానం విస్తరణకు సంబంధించిన డిజైన్లు, నమూనాలకు శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాల్సి ఉందని ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు వివరించారు. వెంటనే వెళ్లి శృంగేరి పీఠం అనుమతి తీసుకోవాలని సీఎం సూచించారు. ఆయన్ను కలిసిన వారిలో దేవస్థానం ఈవో వినోద్‌, స్థపతి వల్లినాయగం, ఈఈ రాజేష్‌, డీఈ రఘునందన్‌, ఆలయ ప్రధాన అర్చకులు ఉమేష్‌ శర్మ తదితరులు ఉన్నారు.

Updated Date - Aug 31 , 2024 | 03:56 AM

Advertising
Advertising