ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బాలబాలికలకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు: రేవంత్‌

ABN, Publish Date - Nov 14 , 2024 | 05:07 AM

భారతదేశ తొలి ప్రధానమంత్రి, స్వాతంత్ర సమరయోధులు జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి(నవంబరు 14వ తేదీ) సందర్భంగా ఆయనకు సీఎం రేవంత్‌ రెడ్డి గురువారం నివాళులు అర్పించారు.

  • పాఠశాల విద్యా వ్యవస్థలో వినూత్న మార్పులకు శ్రీకారం

  • నెహ్రూకు జయంతి సందర్భంగా నివాళులు అర్పించిన సీఎం

హైదరాబాద్‌, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): భారతదేశ తొలి ప్రధానమంత్రి, స్వాతంత్ర సమరయోధులు జవహర్‌లాల్‌ నెహ్రూ జయంతి(నవంబరు 14వ తేదీ) సందర్భంగా ఆయనకు సీఎం రేవంత్‌ రెడ్డి గురువారం నివాళులు అర్పించారు. నెహ్రూ పుట్టిన రోజును జాతీయ బాలల దినోత్సవం నిర్వహించుకుంటాం కాబట్టి రాష్ట్రంలోని బాలబాలికలు అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. నేటి బాలబాలికలే భావి భారత పౌరులని విశ్వసించి ప్రజాప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టిందని రేవంత్‌ వెల్లడించారు.


విద్యా సంస్కరణల్లో భాగంగా నిపుణులతో కూడిన విద్యాకమిషన్‌ ఏర్పాటు, ఉపాఽధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, కొత్త నియామకాలు వంటివన్నీ పిల్లలకు బంగారు భవిష్యత్తు అందించాలన్న సంకల్పంలో భాగంగానే చేపట్టామని తెలిపారు. నిరుపేద విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రతి నియోజకవర్గంలో ఏకీకృత గురుకుల పాఠశాలలకు (ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌) శ్రీకారం చుట్టామన్నారు. పిల్లలను జాతి సంపదగా భావించి వారి భవితవ్యం కోసం, నెహ్రూ ఆకాంక్షల మేరకు వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషిచేయాలని సీఎం కోరారు.

Updated Date - Nov 14 , 2024 | 05:07 AM