ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Yadagiri Gutta: 8న గుట్టకు సీఎం రేవంత్‌రెడ్డి

ABN, Publish Date - Nov 04 , 2024 | 03:39 AM

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకోనున్నారు. ఈ నెల 8న ముఖ్యమంత్రి పుట్టినరోజును పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు.

యాదాద్రి, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకోనున్నారు. ఈ నెల 8న ముఖ్యమంత్రి పుట్టినరోజును పురస్కరించుకుని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొననున్నారు. ఆదివారం ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అదనపు కలెక్టర్‌(రెవెన్యూ) జి.వీరారెడ్డితో కలిసి ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు.


కొండకింద హెలీప్యాడ్‌ స్థలాన్ని పరిశీలించారు. 2024 మార్చి 11న కుటుంబసమేతంగా యాదగిరిగుట్టకు క్షేత్రానికి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు. సీఎం హోదాలో రెండోసారి ఆయన గుట్ట క్షేత్ర పర్యటనకు వస్తుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు పటిష్ట బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించనున్నారు.

Updated Date - Nov 04 , 2024 | 03:39 AM