CM Revanth Reddy: హైడ్రా పేరిట అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

ABN, Publish Date - Aug 30 , 2024 | 03:19 AM

హైడ్రా పేరిట అధికారులు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

CM Revanth Reddy: హైడ్రా పేరిట అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

  • వసూళ్లపై దృష్టి పెట్టాలని ఏసీబీకి సీఎం ఆదేశం

  • జన్వాడ ఫామ్‌హౌస్‌ వద్ద సర్వే పూర్తి

హైదరాబాద్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): హైడ్రా పేరిట అధికారులు ఎవరైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని సీఎం రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. వసూళ్లకు పాల్పడే వారిపై దృష్టి సారించాలని ఏసీబీ, విజిలెన్స్‌ అధికారులను అప్రమత్తం చేశారు. హైదరాబాద్‌లో హైడ్రా పేరు చెప్పి కొంతమంది కింది స్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై సీఎం స్పందించారు. గ


తంలో ఇచ్చిన నోటీసులు, రెండు, మూడు ఏళ్ల కిందటి ఫిర్యాదులను అడ్డు పెట్టుకుని కొన్ని చోట్ల రెవెన్యూ, మునిసిపల్‌, ఇరిగేషన్‌ అధికారులు డబ్బులు డిమాండ్‌ చేస్తున్న విషయం తన దృష్టికి వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సీఎంవో గురువారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది.

Updated Date - Aug 30 , 2024 | 03:19 AM

Advertising
Advertising