CS Shanti kumari: మహిళా సంఘాలకు 600 బస్సులు
ABN, Publish Date - Nov 22 , 2024 | 03:14 AM
రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పం మేరకు పలు చర్యలు చేపడుతున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమ అమలుపై గురువారం సచివాలయంలో ఆమె ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
తొలుత 150 బస్సులు: సీఎస్
హైదరాబాద్, నవంబరు 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సీఎం రేవంత్‌రెడ్డి సంకల్పం మేరకు పలు చర్యలు చేపడుతున్నట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమ అమలుపై గురువారం సచివాలయంలో ఆమె ఉన్నత స్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ మహిళా సంఘాల ద్వారా మొత్తం 600 బస్సులను కొనుగోలు చేయించాలని నిర్ణయించామని, మొదటి దశలో భాగంగా 150 బస్సులను వెంటనే కొనడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
మహిళా సంఘాల ద్వారా 4,000 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయించనున్నామని, మొదటి దశలో 1,000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయిస్తామని వివరించారు. ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలను టీజీరెడ్కో, డిస్కమ్‌లు చేపడతాయన్నారు. రాష్ట్రంలో 22 ఇందిరా మహిళా శక్తి భవనాలను ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శిల్పారామంలో 106 షాపులతో ఇందిరా మహిళా శక్తి బజార్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. డిసెంబరు మొదటి వారంలోగా ఈ పనులను పూర్తి చేస్తామన్నారు.
Updated Date - Nov 22 , 2024 | 03:14 AM