ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Konda Surekha: కొండా సురేఖపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

ABN, Publish Date - Oct 03 , 2024 | 04:23 PM

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తోపాటు టాలీవుడ్‌లోని పలువురు హీరోయిన్లుపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి కొండా సురేఖపై ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులోభాగంగా గురువారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్‌ మహిళా కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు.

హైదరాబాద్, అక్టోబర్ 03: బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తోపాటు టాలీవుడ్‌లోని పలువురు హీరోయిన్లుపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి కొండా సురేఖపై ఆ పార్టీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులోభాగంగా గురువారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో మంత్రి కొండా సురేఖపై బీఆర్‌ఎస్‌ మహిళా కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు.


మంత్రి బుధవారం చేసిన ఈ వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని వారు విమర్శించారు. ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేసిన కొండా సురేఖపై చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో వారు ఫిర్యాదు చేశారు. అయితే కొండా సురేఖ చేసిన నిరాధారమైన ఆరోపణలు వెనక్కి తీసుకొని.. వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు.


తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖ బుధవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి కేటీఆర్‌తోపాటు టాలీవుడ్‌లోని పలువురు హీరోయిన్లపై ఆమె అభ్యంతరకర వ్యాఖ్యాలు చేశారు. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో టాలీవుడ్‌లోని అగ్ర హీరోలు సైతం వెంటనే ఆ వ్యాఖ్యలపై స్పందించారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను వారంతా ముక్తకంఠంతో ఖండించారు.


ఇక బీఆర్ఎస్ నేతలు సైతం కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. దీంతో కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని.. అలాగే ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ వారు డిమాండ్ చేశారు. అటువంటి వేళ కొండా సురేఖ గురువారం మీడియా ముందుకు వచ్చి.. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. అయితే కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గదేలేదని ఆమె స్పష్టం చేశారు.


మరోవైపు గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో మేయర్ డిప్యూటీ మేయర్ పీఠాలను సైతం ఆ పార్టీనే కైవసం చేసుకుంది. అయితే ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో రాష్ట్రంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ కొలువు తీరింది. ఆ క్రమంలో రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్‌లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కార్పొరేటర్లు కాంగ్రస్ పార్టీ గూటికి చేరారు.


వారిలో జీహెచ్ఎంపీ మేయర్ జి. విజయలక్ష్మీతోపాటు డిప్యూటీ మేయర్ సైతం ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో మిగిలిన కార్పొరేటర్లు.. గురువారం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి.. మంత్రి కొండా సురేఖపై ఫిర్యాదు చేశారు. తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని పోలీసులకు ఈ సందర్భంగా వారు విజ్జప్తి చేశారు.

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 03 , 2024 | 04:32 PM