Bandi Sanjay: ఓవైసీ వార్నింగ్ ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోంది
ABN, Publish Date - Aug 30 , 2024 | 01:14 PM
హైడ్రాతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామాకు తెరలేపిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. నాగోల్ శుభమ్ కన్వెన్షన్‌లో బీజేపీ సభ్యత్వ నమోదుపై వర్క్ షాప్ జరిగింది.
హైదరాబాద్: హైడ్రాతో కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రామాకు తెరలేపిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. నాగోల్ శుభమ్ కన్వెన్షన్‌లో బీజేపీ సభ్యత్వ నమోదుపై వర్క్ షాప్ జరిగింది. దీనికి బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి అన్ని మోర్చాల అధ్యక్షులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. బీజేపీ వర్క్ షాపులో బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. ఆక్రమణల కూల్చివేతలకు బీజేపీ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. హైడ్రా పేరుతో పేదలను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోబోమన్నారు.
ఎన్ కన్వెన్షన్ ను కొట్టి.. కాంగ్రెస్ ప్రభుత్వం హడావుడి చేసిందన్నారు. సల్కం చెరువులో బిల్డింగులు కట్టామని స్వయంగా ఓవైసీ చెప్పాడన్నారు. ఓవైసీ వార్నింగ్ ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతోందన్నారు. ఓవైసీ బ్రదర్స్ ఆక్రమణలు తొలగించాకే ఇతర భవనాల జోలికి వెళ్లాలని బండి సంజయ్ పేర్కొన్నారు. తాను కేంద్ర మంత్రి అవుతానని కలలో కూడా ఊహించలేదని బండి సంజయ్ తెలిపారు. సామాన్య కార్యకర్తను కేంద్రమంత్రిని చేసిన ఘనత బీజేపీదేనని పేర్కొన్నారు. బీజేపీలో ఎవరైనా రాష్ట్ర అధ్యక్షుడు కావొచ్చని.. ఎంపీ కావొచ్చని అన్నారు.
2028లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడబోతోందన్నారు. అతి తక్కువ సమయంలో రేవంత్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకత కూడగొట్టుకుందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్.. ఇద్దరి టార్గెట్ బీజేపీనేనని పేర్కొన్నారు. రుణమాఫీపై సర్వే పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తోందన్నారు. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తీవ్ర మోసం చేసిందన్నారు. ఆరు గ్యారంటీలను దృష్టి మళ్ళించడానికే హైడ్రా అని విమర్శించారు. గత కేసీఆర్ ప్రభుత్వానికి .. రేవంత్ ప్రభుత్వానికి తేడా లేదని బండి సంజయ్ అన్నారు.
Updated Date - Aug 30 , 2024 | 01:14 PM