ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

RPF: ప్రేమ విఫలమై కానిస్టేబుల్ ఆత్మహత్య

ABN, Publish Date - Aug 27 , 2024 | 08:35 AM

ఇటీవలి కాలంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ప్రేమ విఫలమైందనో.. చదువులో ఫెయిల్ అయ్యాననో.. వ్యాపారంలో నష్టం వచ్చిందనో.. ఇంట్లో తిట్టారనో.. బడిలో కొట్టారనో.. కారణమేమైతేనేమి పరిష్కారం మాత్రం ఆత్మహత్యగానే చాలా మందికి కనిపిస్తోంది.

హైదరాబాద్: ఇటీవలి కాలంలో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. ప్రేమ విఫలమైందనో.. చదువులో ఫెయిల్ అయ్యాననో.. వ్యాపారంలో నష్టం వచ్చిందనో.. ఇంట్లో తిట్టారనో.. బడిలో కొట్టారనో.. కారణమేమైతేనేమి పరిష్కారం మాత్రం ఆత్మహత్యగానే చాలా మందికి కనిపిస్తోంది. సూసైడ్ లేఖ రాసి లేదంటే సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. కొందరైతే మరీ దారుణం. కొందరు పిల్లలైతే ప్రయోజకులు అయ్యారని వారి తల్లిదండ్రులు ఆనందపడే లోపు బలవన్మరణం పాలవుతున్నారు. చివరకు మంచిగా చదివి పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నవారు సైతం ఆత్మహత్యకు పాల్పడటం దారుణం.


ప్రేమ విఫలమై ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పవన్ కుమార్ (34) ఈస్ట్ ఆనంద్ బాగ్‌లోని ఆర్పీఎఫ్ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 23వ తారీఖు ఉదయం పీటీకి హాజరు కాకపోవడంతో అతని కోసం బెటాలియంలో వెతకడం మొదలుపెట్టారు, మధ్యాహ్నం అయ్యే సరికి బెటాలియన్‌లోని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్‌లో కేబులు వైర్లతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. మృతుడు పవన్ కుమార్ తన స్వస్థానానికి చెందిన యువతితో ప్రేమలో ఉన్నాడు. ప్రేమ విఫలమవడంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా సూసైడ్ లేఖ రాసి తన జేబులో పెట్టుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంబంధిత విషయంపై ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి మల్కాజిగిరి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Updated Date - Aug 27 , 2024 | 08:36 AM

Advertising
Advertising
<