రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా
ABN, Publish Date - Dec 27 , 2024 | 12:38 AM
రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై నిరంతరం నిఘా వేసి ఉంచా మని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. వేముల వాడ పట్టణ పోలీస్‌స్టేషన్‌ను గురువారం ఆయన ఆకస్మి కంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ నేరాల నియంత్రణ కోసం పక డ్బందీ చర్యలు తీసు కుంటున్నామని, ఇందులో భాగంగా రౌడీ షీటర్లు హిస్టరీ షీటర్లపై నిరంతరం నిఘా వేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు
వేములవాడ, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై నిరంతరం నిఘా వేసి ఉంచా మని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. వేముల వాడ పట్టణ పోలీస్‌స్టేషన్‌ను గురువారం ఆయన ఆకస్మి కంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ నేరాల నియంత్రణ కోసం పక డ్బందీ చర్యలు తీసు కుంటున్నామని, ఇందులో భాగంగా రౌడీ షీటర్లు హిస్టరీ షీటర్లపై నిరంతరం నిఘా వేసి వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తున్నామని అన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ పట్టణానికి ప్రతినిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తున్నారని, ఈ క్రమంలో పట్టణంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్త కుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని అన్నారు. పట్టణంలో వాహనాల సంఖ్య పెరిగినప్పటికీ ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణ పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాంపల్లి, నందికమాన్, తిప్పాపూర్ బస్టాండ్, కోరుట్ల బస్టాండ్ వంటి ముఖ్య ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలు తన దృష్టికి వచ్చాయని, ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణతో పాటు పట్టణ పరిధిలో పలు జంక్షన్ లలో ఉన్న రోడ్డు సంబంధిత ఇబ్బందులను జిల్లా కలెక్టర్‌తో పాటు సంబం ధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చామని, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ ఇతర అంశాలపై అధికారుల సమన్వయంతో సమస్యను పరిష్కరిస్తామన్నారు. ప్రస్తుతానికి ఆర్‌ఎస్‌ఐ రాజు ఆధ్వర్యంలో కొత్తగా సిబ్బందిని కేటాయించి ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టి క్షేత్ర స్థాయిలో పక్కాగా అమలు చేస్తూ వేములవాడ పట్టణ పరిధిలో స్పెషల్ టీం ఏర్పాటు చేయడంతో పాటు 5 మందితో యాక్షన్ టీం ఏర్పాటు చేశామన్నారు. పట్టణ పరిధిలో 12 లోకేషన్లు గుర్తించి ప్రతి గంటకు ఒకసారి అక్కడి పరిస్థితులను పరిశీలిస్తూ నిరంతరం భద్రత చర్యలు చేపడుతున్నామన్నారు. పట్టణ ఇన్‌స్పెక్టర్ వీరప్ర సాద్, ఎస్‌ఐ రమేష్, సిబ్బంది పాల్గొన్నారు.
Updated Date - Dec 27 , 2024 | 12:39 AM