Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం
ABN, Publish Date - Aug 07 , 2024 | 07:55 AM
నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున నీరు సాగర్‌కు వస్తోంది. దీంతో సాగర్ నీటిమట్టం పెరిగింది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన 20 గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
నల్గొండ : నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున నీరు సాగర్‌కు వస్తోంది. దీంతో సాగర్ నీటిమట్టం పెరిగింది. దీంతో ప్రాజెక్టుకు సంబంధించిన 20 గేట్లను పది అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో : 3,23,965 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం : 584.50 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నిల్వ సామర్థ్యం : 295.99 టీఎంసీలకు చేరుకుంది.
ఈ క్రమంలోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన 20 గేట్లను ఎత్తి పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరోవైపు శ్రీశైలం జలాశయానికి వరద భారీగా కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశంయ ఇన్ ఫ్లో : 2,74,443 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 3,72,053 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం : 883.20 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం : 205.6627 టీఎంసీలకు చేరుకుంది.
కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటిమట్టం : 175 అడుగులు, 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నీటిమట్టం : 165.02 అడుగులు, 31.67 టీఎంసీలకు చేరుకుంది. నాలుగు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. మరోవైపు సూర్యాపేట జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు ఇన్ ఫ్లో : 3,05,200 క్యూసెక్కులు కాగా.. ఔట్ ఫ్లో : 20,000 క్యూసెక్కులుగా ఉంది. పులిచింతలకు ఎగువ నుంచి వస్తున్న వరద 3 లక్షల 27వేల క్యూసెక్కులు. దీంతో విద్యుత్ ఉత్పత్తి కోసం పది వేల క్యూసెక్కుల నీటిని మళ్లించారు. పులిచింతల పూర్తి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 26.79 టీఎంసీలుగా ఉంది. నాగార్జున సాగర్ గేట్లు పూర్తిగా ఎత్తడంతో వరద ప్రవాహం పెరగుతోంది. వచ్చే వరదను బట్టి మరికొన్ని గేట్లు ఎత్తేందుకు అధికారుల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పులిచింతల దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచిస్తున్నారు.
Updated Date - Aug 07 , 2024 | 08:12 AM