ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌కు కొనసాగుతున్న భారీ వరద ప్రవాహం

ABN, Publish Date - Aug 08 , 2024 | 07:58 AM

నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. 18 గేట్ల నుంచి నీటిని విడుదల చేస్తు్న్నారు. ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో : 2,73,370 క్యూసెక్కులు. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం : 585.40 అడుగులకు చేరుకుంది.

నల్గొండ: నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. 18 గేట్ల నుంచి నీటిని విడుదల చేస్తు్న్నారు. ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో : 2,73,370 క్యూసెక్కులు. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం : 585.40 అడుగులకు చేరుకుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం : 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుత నిల్వ సామర్థ్యం : 298.58 టీఎంసీలకు చేరుకుంది. మరోవైపు పులిచింతల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. పులిచింతల ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో : 2,45, 682 క్యూసెక్కులు. ప్రస్తుతం ప్రాజెక్టుకు సంబంధించిన 11 గేట్లు ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.


ఇక పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం : 175 అడుగులు కాగా.. నీటి నిల్వ సామర్ధ్యం 45.77 టీఎంసీలకు చేరుకుంది. ప్రస్తుత నీటిమట్టం : 167.94 అడుగులు, 35.50 టీఎంసీలకు చేరుకుంది. నాలుగు యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. ఇక భద్రాచలం వద్ద భారీగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. నీటి మట్టం 38 అడుగులకు చేరుకుంది. 7,19,875 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోంది. ఇక కడెం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో 1500క్యూ సెక్కులు, అవుట్ ఫ్లో 1 వేయి క్యూ సెక్కులు. కడెం ప్రాజెక్ట్ పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 697.125 అడుగులకు చేరుకుంది.


శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ఇన్ ఫ్లో 8816 క్యూ సెక్కులు. నంది పంప్ హౌజ్ కు 6300, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ 331క్యూసెక్కులు, ఎన్టీపీసీకి 121 క్యూసెక్కుల నీటిని పంపించారు. పూర్తి సామర్థ్యం 700 అడుగులు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 20.175 టిఎంసీలు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 13.8463 టీఎంసీలకు చేరుకుంది. ఇక తాలిపేరు ప్రాజెక్ట్‌కు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టుకు సంబంధించిన 24 గేట్లు ఎత్తి 57,769 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. తాలిపేరు ప్రాజెక్టు ఇన్ ఫ్లో 53,786 క్యూసెక్కులు.

Updated Date - Aug 08 , 2024 | 07:58 AM

Advertising
Advertising
<