ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కొడుకు డబ్బులివ్వడం లేదని తల్లి కిడ్నాప్‌

ABN, Publish Date - Nov 08 , 2024 | 04:09 AM

తామిచ్చిన డబ్బును ఓ వ్యక్తి తిరిగివ్వడం లేదనే కోపంతో అతడి తల్లిని ఓ కాంట్రాక్టర్‌ అపహరించాడు. అతని ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిని బలవంతంగా తన కారులో ఎక్కించాడు.

  • మహారాష్ట్రకు చెందిన ఓ కాంట్రాక్టర్‌ కిరాతకం

  • నిందితుల అరెస్టు, సురక్షితంగా ఇంటికి చేరిన వృద్ధురాలు

వేములవాడ టౌన్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): తామిచ్చిన డబ్బును ఓ వ్యక్తి తిరిగివ్వడం లేదనే కోపంతో అతడి తల్లిని ఓ కాంట్రాక్టర్‌ అపహరించాడు. అతని ఇంట్లోకి చొరబడి వృద్ధురాలిని బలవంతంగా తన కారులో ఎక్కించాడు. తనకివ్వాల్సిన డబ్బు చెల్లించి ఆమెను తీసుకెళ్లమని ఆ కుటుంబానికి హుకుం జారీ చేశాడు. దీనిపై ఫిర్యాదు అందుకుని రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితులను పట్టుకుని ఆ వృద్ధురాలిని సురక్షితంగా ఇంటికి చేర్చారు. మహారాష్ట్రకు చెందిన లాలు నాగోరావు దయారంగలోడ్‌ కర్ణాటకలోని చెరుకు తోటలు కోసే పనుల కాంట్రాక్టు తీసుకుని కూలీల కోసం వేములవాడ మండలం కొడుముంజ గ్రామానికి చెందిన పల్లపు శ్రీనివా్‌సను సంప్రదించాడు.

ఈ పనుల కోసం ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన కూలీలను మాట్లాడేందుకు మధ్యవర్తిగా వ్యవహరించిన శ్రీనివాస్‌ సదరు కాంట్రాక్టర్‌ నుంచి రూ.3.80 లక్షలు తీసుకున్నాడు. అయితే, కూలీలు పనులకు వెళ్లకపోవడంతో ఆ డబ్బు విషయంలో ఇరువురి మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో లాలూ, తన భార్య పంచతుల, మరో నలుగురితో కలిసి కొడుముంజలోని శ్రీనివాస్‌ ఇంటికి బుధవారం వచ్చారు. శ్రీనివాస్‌ ప్రస్తుతం ఛత్తీ్‌సగఢ్‌లో ఉండగా.. అతడి కుటుంబసభ్యులతో వాగ్వాదానికి దిగాడు.

తొలుత శ్రీనివాస్‌ భార్యను తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా ఆమె తప్పించుకోవడంతో శ్రీనివాస్‌ తల్లి భీమాబాయిని ఎక్కించారు. నానమ్మను తీసుకెళ్లొద్దంటూ అడ్డుకున్న పిల్లలను తోసేసి వెళ్లిపోయారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న వేములవాడ పోలీసులు .. ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ ఆదేశాల మేరకు రెండు బృందాలుగా మహారాష్ట్ర వెళ్లారు. నాందేడ్‌ సమీపంలో లాలు వాహనాన్ని గుర్తించి భీమాబాయిని రక్షించారు. లాలు, పంచతులను అరెస్టు చేశారు. మరో నలుగురు పరారయ్యారు.

Updated Date - Nov 08 , 2024 | 04:09 AM