వైద్యులకు సహకారం
ABN, Publish Date - Dec 23 , 2024 | 01:48 AM
కోరుట్ల, మెట్‌పల్లి వైద్యులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు పేర్కొన్నారు.
ఫ కోరుట్ల కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు
కోరుట్ల, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : కోరుట్ల, మెట్‌పల్లి వైద్యులకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని ఇస్టా బ్యాం క్వెట్ హాల్‌లో కోరుట్ల - మెట్‌పల్లి అబ్‌స్టెట్రిక్, గైనకాలజిస్టు సొసైటీ ఆఫ్ ఇండియా (కేఎంవోజీఎస్) కార్యవర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సింగారావు హాజరై మాట్లాడారు. ప్రభుత్వం వైద్య రంగం అ భివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తోందన్నారు. కోరుట్ల, మెట్‌పల్లి ప్రాంతంలో వైద్య రంగం ఎంతో పురోభివృద్ధి జరుగుతోందన్నారు. గైనిక్ సొసైటీ ఆధ్వర్యంలో ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేసి మహిళా బాధితులకు అన్ని విధాలుగా అండగా ఉం టామని హామీ ఇచ్చారు. వైద్యులు రోగులను ఆపద సమయంలో ఆదుకుంటూ సే వలు అందించడం అభినందించదగ్గ విషయమన్నారు. గైనకాలజిస్టు సొసైటీ అధ్య క్షురాలిగా ఎన్నికైన స్వీతీఅనూప్ మాట్లాడుతూ గర్భిణులు, మహిళల పట్ల ప్రత్యేక దృష్టి సారిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గైనకాలజిస్టుల సంఘం అధ్య క్షుడు నరసింహారెడ్డి, కార్యదర్శి అరుణసుమన్, కోరుట్ల, మెట్‌పల్లి ఐఎంఏ అధ్య క్షులు రేగొండ రాజేశ్, గంగసాగర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ అనూప్‌రావు, మెట్‌పల్లి ఆర్డీవో శ్రీనివాస్, కోరుట్ట, మెట్‌పల్లి వైద్యులు పాల్గొన్నారు.
Updated Date - Dec 23 , 2024 | 01:48 AM