ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Phone Tapping Case: ఫోన్ టాపింగ్ కేసులో హైకోర్టులో కౌంటర్ దాఖలు

ABN, Publish Date - Aug 21 , 2024 | 09:18 AM

ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టులో కౌంటర్ దాఖలైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేశాయి. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదని కౌంటర్‌లో కేంద్రం పేర్కొంది.

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో హైకోర్టులో కౌంటర్ దాఖలైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ దాఖలు చేశాయి. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం లేదని కౌంటర్‌లో కేంద్రం పేర్కొంది. ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనిదని తెలిపింది. ఫోన్ ట్యాపింగ్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రత్యేక అధికారం ఉంటుందని పేర్కొంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై తమకు ఎలాంటి సమాచారం లేదని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం తన నివేదికలో పేర్కొన్న అంశాలేంటంటే.. ఫోన్ టాపింగ్ ఎందుకు చేయాల్సి వచ్చిందో కారణాలు చూపించాల్సి ఉంటుంది. ఫోన్ టాపింగ్ చేయడానికి కారణాలు చూపిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రివ్యూ కమిటీల ముందు పెట్టాల్సి ఉంటుంది. ఫోన్ టాపింగ్ చేయడానికి రివ్యూ కమిటీ ఆమోదిస్తే 60 రోజుల వరకు అనుమతి ఉంటుంది. గరిష్టంగా 180 రోజుల వరకు పొడిగించుకోవచ్చని కేంద్రం తన నివేదికలో తెలిపింది. తన నివేదికను కౌంటర్ రూపంలో కేంద్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది.


అనుమతి లేకుండానే రాజ్యాంగ పదవుల్లో ఉన్న అత్యున్నత స్థాయి అధికారులు, నేతల ఫోన్లు ట్యాపింగ్‌ చేశారని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌లో పేర్కొంది. ఇందుకు సంబంధించి విదేశాల్లో ఉన్న నిందితుల్ని కూడా రప్పించేందుకు చర్యలు చేపడుతున్నామని వెల్లడించింది. గత ప్రభుత్వ హయాంలో హైకోర్టు న్యాయమూర్తి ఫోన్‌ ట్యాప్‌ అయిందని, జడ్జీల ఫోన్లను ట్యాప్‌ చేసినట్టు ఇంటెలిజెన్స్‌ అదనపు ఎస్పీ నాయిని భుజంగరావు తన నేరాంగీకార వాంగ్మూలంలో పేర్కొన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వార్తలను పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఈ కథనాలను సుమోటోగా తీసుకున్న హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ టి.వినోద్‌కుమార్‌ ధర్మాసనం మంగళవారం మరోసారి విచారణ చేపట్టింది.


ప్రణీత్‌కుమార్‌ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని పలువురితో కుమ్మక్కై పదేళ్లుగా అనధికారికంగా సమాచారాన్ని సేకరించారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఆ సమాచారాన్నంతా తన వ్యక్తిగత పెన్‌డ్రైవ్‌ల్లో, హార్డ్‌ డిస్క్‌ల్లో నిక్షిప్తం చేశారని వెల్లడించింది. ఆ తర్వాత ఆధారాలు లేకుండా చేయడం కోసం సీసీ కెమెరాలు ఆఫ్‌ చేసి ఆఫీస్‌లోని కంప్యూటర్లతో పాటు హార్డ్‌ డిస్క్‌లను ధ్వంసం చేశారని సైతం రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ కేసులో ప్రభాకర్‌రావు(ఏ–1) ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. ఆయనను రెడ్ కార్నర్ నోటీసులపై రప్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అప్పటి అధికార పార్టీకి అనుకూలంగా పనిచేసేందుకు నిందితులంతా ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ చట్టాన్ని ఉల్లంఘించారని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Updated Date - Aug 21 , 2024 | 09:18 AM

Advertising
Advertising
<