ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Ram Gopal Varma: వర్మపై తొందరపాటు చర్యలొద్దు

ABN, Publish Date - Dec 03 , 2024 | 04:45 AM

సామాజిక మాధ్యమాలలో అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టడంపై వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ఈ నెల 9వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.

  • హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ

అమరావతి, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): సామాజిక మాధ్యమాలలో అనుచిత, అసభ్యకర పోస్టులు పెట్టడంపై వివిధ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను ఈ నెల 9వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది. అప్పటి వరకు ఆయనపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.హరినాథ్‌ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.


సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి లోకేశ్‌పై గతేడాది సామాజిక మాధ్యమాలలో అసభ్యకర, అనుచిత పోస్టులు పెట్టారనే ఆరోపణలతో అనకాపల్లి జిల్లా రావికమతం, గుంటూరు జిల్లా తుళ్లూరు, ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన మూడు వేర్వేరు కేసుల్లో తనకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ రాంగోపాల్‌వర్మ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

Updated Date - Dec 03 , 2024 | 04:45 AM