Kova Lakshmi: ఆసిఫాబాద్ ఎమ్మెల్యేకు హైకోర్టులో ఊరట
ABN, Publish Date - Oct 26 , 2024 | 04:53 AM
ఆసిఫాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది. ఆమె ఎన్నిక చెల్లదని పేర్కొంటూ, కాంగ్రెస్ నేత అజ్మీరా శ్యాం దాఖలు చేసిన ఎలక్షన్ పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం కొట్టేసింది.
హైదరాబాద్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మికి హైకోర్టులో ఊరట లభించింది. ఆమె ఎన్నిక చెల్లదని పేర్కొంటూ, కాంగ్రెస్ నేత అజ్మీరా శ్యాం దాఖలు చేసిన ఎలక్షన్ పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం కొట్టేసింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసిన అజ్మీరా శ్యాం బీఆర్‌ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మి చేతిలో ఓటమిపాలయ్యారు.
లక్ష్మి తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆదాయపు పన్ను వివరాలను దాచిపెట్టారని, అందువల్ల ఆ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఆయన ఎలక్షన్ పిటిషన్ (ఈపీ) దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ కే లక్ష్మణ్ ధర్మాసనం.. కేసులో మెరిట్స్ లేకపోవడంతో కొట్టేస్తున్నట్లు ప్రకటించింది.
Updated Date - Oct 26 , 2024 | 04:53 AM