ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

KCR: కేసీఆర్‌కు మరోసారి కోర్టు సమన్లు

ABN, Publish Date - Sep 06 , 2024 | 09:47 AM

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మరోసారి కోర్టు సమన్లు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారంలో ఈ నెల 17న.. విచారణకు హాజరుకావాలని భూపాలపల్లి జిల్లా కోర్టు సమన్లు జారీ చేయడం జరిగింది.

హైదరాబాద్: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మరోసారి కోర్టు సమన్లు జారీ చేసింది. మేడిగడ్డ బ్యారేజీ వ్యవహారంలో ఈ నెల 17న.. విచారణకు హాజరుకావాలని భూపాలపల్లి జిల్లా కోర్టు సమన్లు జారీ చేయడం జరిగింది. కేసీఆర్‌ సహా ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కూ కోర్టు సమన్లు జారీ చేసింది. బ్యారేజీ కుంగిపోవడంతో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని.. ఈ అంశంపై విచారణ చేయాలని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు సమన్లు జారీ చేసింది. భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి అనే వ్యక్తి మేడిగడ్డ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించారు.


రాజలింగమూర్తి పిటిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిగణనలోకి తీసుకున్న జిల్లా జడ్జి.. పిటిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోరిన విధంగా మాజీ సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మాజీ మంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావుతో పాటు 8 మందికి ఆగస్టు మొదటి వారంలో నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసుల్లో సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 5న భూపాలపల్లి జిల్లా కోర్టుకు హాజరుకావాలని వారందరికీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో గురువారం కేసు విచారణకు వచ్చింది. అయితే కోర్టుకు నిన్న హరీశ్​రావు తరపున న్యాయవాదులు లలితా రెడ్డి, సుకన్య.. కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థ మేఘా కృష్ణారెడ్డి, ఇరిగేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాజీ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ రజత్ కుమార్, ఎల్ అండ్ టీ ఎండీ సురేశ్​ కుమార్ తరఫున సుప్రీంకోర్టు అడ్వకేట్లు అవధాని, శ్రావణ్ రావు.. ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజినీర్లు హరిరామ్, శ్రీధర్ తరఫున వరంగల్ అడ్వకేట్ నరసింహారెడ్డి హాజరయ్యారు.


అయితే కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఐఏఎస్‌ అధికారిణి‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్మితా సబర్వాల్​ తరపున మాత్రం న్యాయవాదులెవ్వరూ కోర్టుకు హాజరుకాలేదు. దీంతో ఈ కేసును వచ్చే నెల 17కు జిల్లా జడ్జి నారాయణబాబు వాయిదా వేశారు. గురువారం కోర్టుకు హాజరుకాని కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్మితాసబర్వాల్​సైతం అదే రోజు (ఈ నెల 17న) కోర్టుకు హాజరుకావాలని ఆదేశిస్తూ మరోసారి సమన్లు జారీ చేశారు. అయితే చట్టానికి ఎవరూ అతీతులు కారని.. అందరూ సమానమేనని పిటిషినర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజలింగమూర్తి మీడియాకు తెలిపారు. మేడిగడ్డ వ్యవహారంలో భారీ మొత్తంలో ప్రజాధనం దుర్వినియోగమైందని అన్నారు.

Updated Date - Sep 06 , 2024 | 10:46 AM

Advertising
Advertising