CP Srinivasa Reddy: పండగలను ప్రశాంతంగా జరుపుకోవాలి
ABN, Publish Date - Apr 21 , 2024 | 08:39 AM
పండగలు, ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి(Hyderabad CP Kottakota Srinivas Reddy) సూచించారు. త్వరలో రానున్న హనుమాన్ జయంతి ర్యాలీ సందర్భంగా బజరంగదళ్, విశ్వహిందూ పరిషత్ సభ్యులతో పాటు ఇతర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
- సీపీ శ్రీనివాసరెడ్డి
హైదరాబాద్ సిటీ: పండగలు, ర్యాలీలను శాంతియుతంగా నిర్వహించుకోవాలని హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి(Hyderabad CP Kottakota Srinivas Reddy) సూచించారు. త్వరలో రానున్న హనుమాన్ జయంతి ర్యాలీ సందర్భంగా బజరంగదళ్, విశ్వహిందూ పరిషత్ సభ్యులతో పాటు ఇతర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ర్యాలీలో డీజే, ఫైర్ క్రాకర్‌లు పేల్చడం, బాటసారులపై రంగులు చల్లడం, కర్రలు, కత్తులు, ఆయుధాలు తీసుకెళ్లడం, రెచ్చగొట్టే ప్రసంగాలు, పాటలు, బ్యానర్‌లు ప్రదర్శించడంపై నిషేధం ఉందన్నారు.
ఇదికూడా చదవండి: బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిస్తే.. పార్టీ మారరని చెప్పగలరా?
పోలీసుల అనుమతి లేకుండా డ్రోన్‌లను వినియోగించకూడదన్నారు. ర్యాలీ ప్రశాంతంగా జరిగేలా అందరూకలిసి సహకరించుకోవాలన్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ర్యాలీ నిర్వాహకులు మోడల్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించకూడదన్నారు. ఈ సమావేశంలో సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల(Cyberabad and Rachakonda Commissionerates) ఉన్నతాధికారులు, జీహెచ్‌ఎంసీ, ఆర్‌అండ్‌బీ, రవాణా, వైద్యశాఖలకు చెందిన సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: ప్రజలపై పన్నుల భారం మోపం
Updated Date - Apr 21 , 2024 | 08:39 AM