కూరగాయల సాగు.. లాభాలు బాగు
ABN, Publish Date - Dec 27 , 2024 | 12:07 AM
నూతనకల్- ఆంధ్రజ్యోతి : ఏ ఏటికాయేడు పంటల సాగులో పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేపట్టాలనుకున్నాడు. మార్కెట్‌లో డిమాండ్ ఉండే కూరగాయల, పూల సాగు ఎంచుకొని సాగు చేస్తూ సత్ఫలితాలను పొందుతున్నాడు
నూతనకల్ మండలంలోని ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన అనంతుల లింగయ్యగౌడ్. తనకు ఉన్న 4 ఎకరాల భూమిలో వరికి భిన్నంగా కూరగాయలు, పూల సాగు చేస్తు న్నాడు. నాలుగేళ్లుగా కూరగాయాలు సాగు చేస్తూ ప్రతి నెల రూ. 70 వేలు ఆదాయం పొందుతున్నట్లు రైతు చెప్పారు. ఎకరం భూమిలో బెండ, ఎకరంలో సొరకాయ, ఎకరంలో టమాట, ఎకరంలో వంకాయ సాగు చేస్తున్నాడు. కూరగాయలు కోయడానికి ప్రతి రోజు 8మంది కూలీల అవసరం ఉంటుందని రైతు తెలిపారు. సంవత్సరం మొత్తం కూగాయలు సాగు చేయడం వల్ల పలువురికి ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. బతుకమ్మ పండగ ముందు రెండు ఎక రాల్లో బంతి, చామంతిపూల సాగు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా మార్కెటింగ్ ఇబ్బంది లేకుండా ఉండానికి సొంతంగా ఆటోను కొనుగోలు కూరగాయలను సూర్యాపేట, ఖమ్మం మార్కెట్లల్లో విక్రయిస్తానని తెలిపారు. 365 జాతీయ రహదారి పక్కన భూమి ఉండడంతో పూలను కూరగాయలు, పూలను విక్రయించడానికి అనువుగా ఉందన్నారు.
నెలకు రూ.70 వేలు ఆదాయం
నాతో పాటు నా భార్య, కుమారుడు, 8మంది కూలీలం పనిచేస్తాం. కూరగాయలు కోయడం, ప్యాక్ చేయడం మార్కెట్‌కు తరలించడం ఇవే ప్రతి రోజు చేసే పనులు. కూలీలకు ఒక్కొక్కరికీ రూ. 250 చొప్పున కూలీ ఇస్తాం ఒక్క పూట పని ఉంటుంది. పెట్టుబడి, కూలీల ఖర్చు పోను ప్రతి నెల రూ.70 వేలు ఆదాయం వస్తుంది. ఇతర పంటల కంటే కూరగాయలు, పూల సాగే బాగుంది. -అనంతుల లింగయ్య, రైతు, ఎర్రపహాడ్
Updated Date - Dec 27 , 2024 | 12:07 AM