ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Ts News: కానిస్టేబుల్ అయేషా సస్పెండ్, ఏబీవీపీ ఝాన్సీ ఘటనలో సైబరాబాద్ సీపీ చర్యలు

ABN, Publish Date - Jan 30 , 2024 | 08:00 AM

ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీతో దురుసుగా ప్రవర్తించిన మహిళా కానిస్టేబుల్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఝాన్సీ జుట్టు లాగిన కానిస్టేబుల్‌ అయేషాను సస్పెండ్ చేశారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీచేశారు.

రాజేంద్రనగర్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ పట్ల దురుసుగా ప్రవర్తించిన మహిళా కానిస్టేబుల్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఝాన్సీ జుట్టు లాగిన కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు.

ఏం జరిగిందంటే..?

రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 55 జారీచేసింది. జీవో రద్దు చేయాలని ఇటీవల రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఏబీవీపీ ఆందోళన చేపట్టింది. ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల నుంచి ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీ తప్పించుకునే ప్రయత్నం చేసింది. అక్కడి నుంచి పారిపోయేందుకు పరుగు తీసింది. ఝాన్సీని పట్టుకునేందుకు ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు స్కూటీపై వెళ్లారు. అయేషా అనే కానిస్టేబుల్ ఝాన్సీ పట్ల దురుసుగా ప్రవర్తించింది. స్కూటీ వెనకాల కూర్చొన్న ఆమె ఝాన్సీ జట్టు పట్టుకొని లాగింది. దీంతో ఝాన్సీ కింద పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టింది. సైబరాబాద్ పోలీస్ కమీషనర్ అవినాత్ మహంతి స్పందించి ఘటనపై విచారణకు ఆదేశించారు. కానిస్టేబుల్ అయేషా దురుసుగా ప్రవర్తించిందని విచారణలో తేలింది. దీంతో అయేషాను సస్పెండ్ చేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 30 , 2024 | 08:11 AM

Advertising
Advertising