ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అసంక్రమిత వ్యాధులకు ప్రత్యేక క్లినిక్‌లు

ABN, Publish Date - Nov 05 , 2024 | 04:05 AM

ఏటా పెరుగుతున్న అసంక్రమిత వ్యాధుల(నాన్‌-కమ్యూనికెబుల్‌ డిసీజె్‌స-ఎన్‌సీడీ) నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.

  • మాతాశిశు సంక్షేమ కేంద్రాల మాదిరిగా ఏర్పాటు: మంత్రి దామోదర

హైదరాబాద్‌, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఏటా పెరుగుతున్న అసంక్రమిత వ్యాధుల(నాన్‌-కమ్యూనికెబుల్‌ డిసీజె్‌స-ఎన్‌సీడీ) నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఈ వ్యాధుల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని, చికిత్సకు ప్రత్యేక క్లినిక్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. మాతా-శిశు సంక్షేమ(ఎంసీహెచ్‌) కేంద్రాల మాదిరిగా.. ఎన్‌సీడీ క్లినిక్‌లను ఏర్పాటు చేయాలన్నారు. సోమవారం ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ కార్యాలయంలో జరిగిన సమీక్షలో మంత్రి ఈ మేరకు సూచనలు చేశారు.


ఈ సందర్భంగా ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌ వంటి అసంక్రమిత వ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య ఏటా పెరుగుతోందని వివరించారు. ప్రస్తుతం మొత్తం అనారోగ్య సమస్యల్లో 60ు ఎన్‌సీడీతో ముడిపడి ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ.. ఎన్‌సీడీ చికిత్సకు అన్ని బోధనాస్పత్రుల్లో ప్రత్యేక క్లినిక్‌లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత దశలవారీగా జిల్లా, ఏరియా ఆస్పత్రులకు వీటి సేవలను విస్తరించాలన్నారు. ఆరోగ్యశ్రీ సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని, చికిత్స కోసం ప్రజలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Updated Date - Nov 05 , 2024 | 04:05 AM