ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Congress: కమిటీల పేరుతో కాలయాపన చేశారు.. బీఆర్ఎస్‌పై మండిపడిన దామోదర

ABN, Publish Date - Sep 23 , 2024 | 09:33 PM

ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాతాశిశు మరణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పందించారు.

హైదరాబాద్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో మాతాశిశు మరణాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు. 2017లో కోఠి ప్రసూతి ఆస్పత్రిలో మూడు రోజుల్లో ఆరుగురు బాలింతలు మృతి చెందారని దామోదర అన్నారు. అదే ఏడాది నిలోఫర్లో ఐదు రోజుల్లో ఐదుగురు బాలింతలు మరణించారని.. 2022లో కుటుంబ నియంత్రణ కోసం చేసిన డీపీఎల్ క్యాంపుల్లో నలుగురు వనితలు చనిపోయినట్లు చెప్పారు.

2019లో డెంగ్యూ మరణాల సంఖ్య 100 దాటిందన్నారు. డీపీఎల్ క్యాంపులో జరిగిన ఘటన కారణంగా మరణించిన వారి పిల్లలు అనాథలయ్యారని చెప్పారు. వారికి అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన హామీలు అటకెక్కించిందని విమర్శించారు.


గతంతో పోలిస్తే ఇప్పుడు మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గినట్లు దామోదర అన్నారు. కమిటీల పేరుతో బీఆర్ఎస్ కాలయాపన చేసిందని.. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించలేదని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీ నిర్లక్ష్యం కారణంగా పేదలకు ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారిందన్నారు. గత పదేళ్లలో నిర్వీర్యమైన వైద్య వ్యవస్థను తాము గాడిలో పెడుతున్నామని మంత్రి వివరించారు. బీఆర్ఎస్ వేసిన నిజనిర్ధారణ కమిటీ వారి హయాంలో జరిగిన అవకతవకల గురించి ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

Monkeypox: చాపకింద నీరులా మంకీపాక్స్.. భారత్‌‌లో మూడో కేసు నమోదు

For Latest News and National News click here

Updated Date - Sep 23 , 2024 | 09:34 PM