MLC Kavitha: నేడు రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ మద్యం విధానం సీబీఐ కేసుపై విచారణ
ABN, Publish Date - Jul 26 , 2024 | 10:22 AM
నేడు రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ మద్యం విధానం సీబీఐ కేసుపై విచారణ జరగనుంది. ఈ ఢిల్లీ మద్యం విధానంలో ఎమ్మెల్సీ కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది.
ఢిల్లీ: నేడు రౌస్ అవెన్యూ కోర్టులో ఢిల్లీ మద్యం విధానం సీబీఐ కేసుపై విచారణ జరగనుంది. ఈ ఢిల్లీ మద్యం విధానంలో ఎమ్మెల్సీ కవిత పాత్రపై సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌పై రౌస్ అవెన్యూ కోర్టు విచారణ జరపనుంది. కవితపై సీబీఐ దాఖలు చేసిన చార్జ్ షీట్‌ను ఈనెల 22న పరిగణనలోకి తీసుకుంది. ఇవాళ కవితను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు పరచాలని కోర్టు గత వారం ఆదేశించింది. కవితపై చార్జ్ షీట్‌లో కీలక అంశాలు వెలుగు చూశాయి. మద్యం విధానం రూపకల్పనలో కవితను సూత్రధారిగా సీబీఐ పేర్కొంది. మద్యం వ్యాపారులకు అనుకూలంగా మద్యం విధానాన్ని తయారు చేయడం... అందుకోసం పెద్ద ఎత్తున సౌత్ గ్రూప్ నుంచి ముడుపులు ఇచ్చారు.
రూ. 100 కోట్ల ముడుపులు సేకరించి విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి చేర్చడంలో కవిత సూత్రధారిగా పని చేశారని సీబీఐ అంటోంది. కవిత కోసం బుచ్చిబాబు, అభిషేక్ బోయిన్ పల్లి, అరుణ్ పిళ్ళై, అశోక్ కౌశిక్ పని చేశారని సీబీఐ చెబుతోంది. లిక్కర్ వ్యాపారంలో భాగస్వామ్యం కోసం కవితకు మాగుంట రాఘవ, వెనక శరత్ రెడ్డి డబ్బు సమకూర్చాని అంటోంది. కవిత సహకారంతో మద్యం వ్యాపారంలో శరత్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి రిటైల్ జోన్స్ పొందారని ఇందుకోసం కవితకు డబ్బు ఇచ్చారని సీబీఐ చెబుతోంది. మద్యం వ్యాపారం పేరుతో వసూలు చేసిన డబ్బు హవాలా ద్వారా గోవా ఎన్నికల్లో ఖర్చు చేశారని సీబీఐ ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే.
మద్యం విధానం సీబీఐ కేసులో ఏప్రిల్ 11న కవితను దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. మూడు రోజుల సీబీఐ కస్టడీ అనంతరం ఏప్రిల్ 15 నుంచి జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైలులో కవిత ఉన్నారు. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా కవిత తీహార్ జైలులో ఉన్నారు. ఈడీ, సీబీఐ కేసుల్లో జూలై 1న కవిత బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. కాగా.. మద్యం కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాఖలు చేసిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్ కస్టడీని ఈనెల 31 వరకు పొడిగించగా.. సీబీఐ దాఖలు చేసిన అవినీతి కేసులో ఆగస్టు 8వ తేదీ వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి కావేరి బవేజా గురువారం ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి...
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jul 26 , 2024 | 11:11 AM