Hyderabad: రూ.8 కోట్లు ఇవ్వలేదని భర్తను హత్య చేసి.. పోలీసులకు దొరక్కుండా..
ABN, Publish Date - Oct 28 , 2024 | 01:07 PM
కర్ణాటకలో కొన్ని రోజుల క్రితం వెలుగు చూసిన ఓ హత్య కేసు మూలాలు తెలంగాణలో బయటపడ్డాయి. రూ.8 కోట్లు ఇవ్వని కారణంగా హైదరాబాద్‌కు చెందిన ఓ వివాహిత తన ప్రేమికుడితో కలిసి భర్తను చంపి మృతదేహాన్ని కర్ణాటకలో వదిలించుకున్నట్టు తేలింది.
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలో కొన్ని రోజుల క్రితం వెలుగు చూసిన ఓ హత్య కేసు మూలాలు తెలంగాణలో బయటపడ్డాయి. రూ.8 కోట్లు ఇవ్వని కారణంగా హైదరాబాద్‌కు చెందిన ఓ వివాహిత తన ప్రేమికుడితో కలిసి భర్తను చంపి మృతదేహాన్ని కర్ణాటకలో వదిలించుకున్నట్టు తేలింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అక్టోబర్ 8న హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి రమేశ్ (54) మృతదేహం కర్ణాటకలో లభించింది. కొడగు జిల్లాలోని ఓ కాఫీ తోటలో పూర్తిగా దగ్ధమైన స్థితిలో మృతదేహం లభించింది. దీంతో, పోలీసులు సీసీటీవీ ఫుటేజీని జల్లెడ పట్టగా ఎరుపు రంగు మెర్సిడీజ్ కారుపై వారి దృష్టి పడింది. ఆ కారు రమేశ్ పేరిట రిజిస్టర్ అయి ఉందని, అతడు కనిపించట్లేదంటూ భార్య నీహారిక (29) పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కూడా గుర్తించారు. దీంతో, వారు తెలంగాణ (Telangana) పోలీసులను సంప్రదించారు.
ఇక దర్యాప్తు సందర్భంగా పోలీసులకు రమేశ్ భార్య నీహారికపై అనుమానం కలిగింది. ఆమెను అదుపులోకి తీసుకోగా చివరకు చేసిన నేరాన్ని ఆమె అంగీకరించక తప్పలేదు. తన ప్రేమికుడు, వెటర్నరీ డాక్టర్ అయిన నిఖిల్, మరో వ్యక్తి అంకుర్‌తో కలిసి భర్త రమేశ్‌ను హత్య చేసినట్టు అంగీకరించింది. ఈ క్రమంలో నీహారిక నేపథ్యానికి సంబంధించి పోలీసులు పలు కీలక విషయాలు వెలికి తీశారు.
TG Highcourt: హైకోర్టును ఆశ్రయించిన రాజ్ పాకాల
నీహారిక చిన్న తనం చాలా ఒడిదుడుకుల్లో గడిచినట్టు పోలీసులు గుర్తించారు. ఆమెకు 16 ఏళ్ల ఉండగా తండ్రి మరణించడంతో తల్లి మరో వివాహం చేసుకుంది. అయితే, చదువుల్లో మాత్రం ప్రతిభ కనబరిచిన ఆమె ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరింది. పెళ్లి చేసుకున్న ఆమె, ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ తరువాత కొంతకాలానికి భర్తతో విడిపోయింది. కొన్నాళ్ల పాటు నిహారిక హర్యానాలో కూడా ఉందని, అప్పట్లో ఓ ఆర్థికమోసానికి సంబంధించిన కేసులో జైలు పాలైనట్టు పోలీసులు గుర్తించారు. జైల్లో ఉండగానే ఆమెకు అంకుర్‌తో పరిచయమైంది.
జైలు నుంచి విడుదలయ్యాక నీహారిక రమేశ్‌ను వివాహం చేసుకుంది. ఆమెకు ఇది రెండో వివాహం. ఈ క్రమంలోనే విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిన ఆమె ఓసారి ఆమె భర్తను రూ.8 కోట్లు ఇవ్వాలని కోరింది. రమేశ్ మాత్రం ఆమె డిమాండ్‌ను తిరస్కరించాడు. ఈ క్రమంలోనే నీహారిక భర్త ఆస్తి మొత్తం సొంతం చేసుకునేందుకు తన ప్రియుడు నిఖిల్, మరో వ్యక్తి అంకుర్‌తో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసింది.
Ts News: హాజరుకాకుంటే అరెస్ట్ తప్పదని హెచ్చరికలు
అక్టోబర్ 1న నిందితులు ఉప్పల్‌లో రమేశ్‌కు ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. ఆ తరువాత వారు అతడి ఇంటికి వెళ్లి డబ్బు తీసుకుని బెంగళూరుకు బయలుదేరారు. ఓ చోట పెట్రోల్ నింపుకున్నాక కొడగుకు వెళ్లి అక్కడి కాఫీ తోటలో రమేశ్ మృతదేహాన్ని వదిలించుకున్నారు. మృతదేహాన్ని ఓ దుప్పటిలో చుట్టి నిప్పంటించి వెనక్కు వచ్చేశారు. అనంతరం నీహారిక.. భర్త కనిపించట్లేదంటూ హైదరాబాద్‌లో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
సవాలుగా మారిన దర్యాప్తు..
ఆనవాళ్లు కూడా గుర్తుపట్టలేనంతగా మృతదేహం దగ్ధం కావడంతో కర్ణాటక పోలీసులకు ఈ కేసు సవాలుగా మారింది. దీంతో, వారు స్థానికంగా అనుమానాస్పద ఘటనలేమైనా జరిగాయేమో తెలుసుకునేందుకు సీసీటీవీ ఫుటేజీ జల్లెడ పట్టారు. రాత్రి వేళ ఎర్ర మెర్సిడీజ్ కారు అనుమానాస్పదంగా సంచరిస్తున్న వైనం వారి కంట పడింది. రాత్రి కావడంతో కారు నెంబర్ వీడియోలో సరిగా రికార్డు కాలేదు. దీంతో, కాఫీ తొటలు మొదలు టుమ్కూర్ వరకూ ఉన్న 500 సీసీటీవీ కెమెరాల ఫుటేజీ పరిశీలించి కారు తెలంగాణకు చెందినదిగా గుర్తించారు. దీంతో, రమేశ్ భార్య చేసిన దారుణం వెలుగులోకి వచ్చింది.
ead Latest Telangana News And Telugu News
Updated Date - Oct 28 , 2024 | 01:37 PM