HYDRA: ప్రజల దృష్టి మరల్చేందుకే హైడ్రా డ్రామా:అరుణ

ABN, Publish Date - Aug 27 , 2024 | 03:51 AM

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్‌ సర్కారు.. ప్రజల దృష్టిని మరల్చేందుకే హైడ్రా డ్రామా ఆడుతోందని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు.

HYDRA: ప్రజల దృష్టి మరల్చేందుకే హైడ్రా డ్రామా:అరుణ

  • వ్యక్తులే లక్ష్యంగా హైడ్రా ఉండొద్దు: బీజేపీ నేతలు

మక్తల్‌/హైదరాబాద్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైన కాంగ్రెస్‌ సర్కారు.. ప్రజల దృష్టిని మరల్చేందుకే హైడ్రా డ్రామా ఆడుతోందని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. సోమవారం నారాయణపేట జిల్లా మక్తల్‌లో ఆమె మాట్లాడారు. ఆరు గ్యారెంటీలు సహా ప్రజలకు ఇచ్చిన అనేక హామీల అమలులో కాంగ్రెస్‌ పూర్తిగా విఫలం అయ్యిందన్నారు. కాగా, చెరువులు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణల తొలగింపులో హైడ్రా పక్షపాతం చూపవద్దని, వ్యక్తులే లక్ష్యంగా దీనిని కొనసాగించవద్దని బీజేపీ డిమాండ్‌ చేసింది.


బీజేపీ మేడ్చల్‌ అర్బన్‌, రూరల్‌, రంగారెడ్డి రూరల్‌ పార్టీ అధ్యక్షులు, సీనియర్‌ నాయకులు పార్టీ కార్యాలయంలో సమావేశమై ప్రభుత్వం చేపట్టిన ఆక్రమణల కూల్చివేతలపై చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. అనుమతులు తీసుకుని ఇళ్లు కట్టుకున్న వారు, అనుమతులున్నాయని గుర్తించి అపార్టుమెంట్లు కొనుగోలు చేసిన వారి విషయంలో ప్రభుత్వం ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Aug 27 , 2024 | 03:52 AM

Advertising
Advertising
<