Hydarabad: చేప పిల్లల పంపిణీని కొనసాగించాలి..
ABN, Publish Date - May 17 , 2024 | 04:06 AM
రాష్ట్రంలో మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం కొనసాగించాలని తెలంగాణ ముదిరాజ్ మహా సంఘం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మృగశిర కార్తె రోజున హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ‘ఫిష్ ఫెస్టివల్’ నిర్వహించాలని కోరారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో సంఘం రాష్ట్ర సమన్వయకర్త బొక్క శ్రీనివాస్ ముదిరాజ్, రాష్ట్ర యూత్ విభాగం అధ్యక్షుడు రంజిత్ ముదిరాజ్ తదితరులతో కలిసి మాట్లాడారు.
అన్ని జిల్లాల్లో ‘ఫిష్ ఫెస్టివల్’ నిర్వహించాలి
ముదిరాజ్ మహా సంఘం రాష్ట్ర కన్వీనర్
పంజాగుట్ట, మే 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మత్స్యకారులకు ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం కొనసాగించాలని తెలంగాణ ముదిరాజ్ మహా సంఘం రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. మృగశిర కార్తె రోజున హైదరాబాద్‌తో పాటు అన్ని జిల్లాల్లో ‘ఫిష్ ఫెస్టివల్’ నిర్వహించాలని కోరారు. గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటుచేసిన సమావేశంలో సంఘం రాష్ట్ర సమన్వయకర్త బొక్క శ్రీనివాస్ ముదిరాజ్, రాష్ట్ర యూత్ విభాగం అధ్యక్షుడు రంజిత్ ముదిరాజ్ తదితరులతో కలిసి మాట్లాడారు. తమకు అన్యాయం చేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని అసెంబ్లీ ఎన్నికల్లో కూల్చివేశామన్నారు. ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రిమండలిలో ప్రాతినిథ్యం కల్పిస్తామని, బీసీ-డీ గ్రూపు నుంచి బీసీ-ఏ గ్రూపులోకి మారుస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారన్నారు. తమ సామాజిక వర్గం అభివృద్ధి, సంక్షేమానికి పాటుపడడమే కాకుండా ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు, నామినేటెడ్ పదవుల్లో అవకాశం, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గెలుపు కోసం కృషి చేయడంపై రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతు తెలిపారు. సంఘం నాయకులు ఎస్.మహేష్ ముదిరాజ్, ఎం.వెంకటేష్ ముదిరాజ్, శేఖర్ ముదిరాజ్ పాల్గొన్నారు.
Updated Date - May 17 , 2024 | 04:06 AM