ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: ఆలౌట్‌ తాగిన చిన్నారి.. ప్రాణాలు కాపాడిన వైద్యులు

ABN, Publish Date - May 26 , 2024 | 11:57 AM

ఆలౌట్‌ సీసా మొత్తం తాగేసిన ఛత్తీస్ గఢ్‌(Chattisgarh)కు చెందిన 18నెలల చిన్నారికి ఎక్మో చికిత్స అందించి ప్రాణాపాయ స్థితి నుంచి కిమ్స్‌ కడల్స్‌ వైద్యులు కాపాడారు. శనివారం కొండాపూర్‌(Kondapur)లోని కిమ్స్‌ కడల్స్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్యులు వివరాలు వెల్లడించారు.

హైదరాబాద్‌ సిటీ: ఆలౌట్‌ సీసా మొత్తం తాగేసిన ఛత్తీస్ గఢ్‌(Chattisgarh)కు చెందిన 18నెలల చిన్నారికి ఎక్మో చికిత్స అందించి ప్రాణాపాయ స్థితి నుంచి కిమ్స్‌ కడల్స్‌ వైద్యులు కాపాడారు. శనివారం కొండాపూర్‌(Kondapur)లోని కిమ్స్‌ కడల్స్‌ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైద్యులు వివరాలు వెల్లడించారు. ఛత్తీస్ గఢ్‌ రాష్ట్రంలోని భిలాయ్‌ ప్రాంతానికి చెందిన విశాల్‌ బట్ర, బర్కా బట్ర దంపతుల కుమార్తె ప్రీత్‌ బట్ర(18నెలలు) ఆడుకుంటూ ఆలౌట్‌ సీసాలోని రసాయనం మొత్తం తాగేసింది. అనంతరం ఊపిరి అందక ఇబ్బంది పడుతుండటంతో తల్లిదండ్రులు వెంటనే స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి రాయ్‌పూర్‌(Raipur)కు తీసుకెళ్లి వెంటిలేటర్‌ అమర్చి చికిత్స అందించి నప్పటకీ ఆరోగ్యం మెరుగుపడలేదు. మరో వైపు ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినడంతో ఊపిరి తీసుకోవడం కష్టమైంది. దీంతో అక్కడి వైద్యులు హైదరాబాద్‌ కొండాపూర్‌లోని కిమ్స్‌ కడల్స్‌ వైద్యులను సంప్రందించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: హైదరాబాద్‌ నాకు లక్కీసిటీ...


కిమ్స్‌ కడల్స్‌కు చెందిన ఇద్దరు ఇంటెన్సివిస్టులు, ఒక పెర్ఫ్యూజనిస్టు, ఒక కార్డియాక్‌ సర్జన్‌, ఐసీయూ నర్సు కలిసి రాయ్‌పూర్‌కు వెళ్లారు. అక్కడ పాపను పరీక్షించి ఆలౌట్‌లోని హైడ్రోకార్బన్‌ వల్ల కెమికల్‌ న్యూమోనైటిస్‌ అనే సమస్య తీవ్రంగా ఉందని గుర్తించారు. పాపకు ఎక్మో పెట్టి రోడ్డు మార్గంలో రాయ్‌పూర్‌ విమానాశ్రయానికి, అక్కడి నుంచి ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా బేగంపేట విమానాశ్రయానికి(Begumpet Airport) తరలించారు. అక్కడి నుంచి కొండాపూర్‌లోని ఆస్పత్రికి తీసుకొచ్చారు. పాపను తొమ్మిది రోజుల పాటు వీఏ-ఎక్మో మీద పెట్టాక పరిస్థితి మెరుగుపడింది. 18 రోజుల చికిత్స తర్వాత పాప పూర్తిగా కోలుకుంది. గురువారం ఆమెను డిశ్చార్జి చేశారు. ఎక్మోపై పిల్లలను పెట్టి ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించడం, మెడ వద్ద కాన్యులా పెట్టి తరలించడం దేశంలోనే అరుదైనదని పిల్లల విభాగం క్లినికల్‌ డైరెక్టర్‌, పీడియాట్రిక్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌ విభాగాధిపతి డాక్టర్‌ పరాగ్‌ శంకర్రావు డెకాటే తెలిపారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu Newshy

Updated Date - May 26 , 2024 | 11:57 AM

Advertising
Advertising