Share News

మాజీ సీఎం కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదైంది: రఘునందన్‌

ABN , Publish Date - Jun 14 , 2024 | 04:16 AM

గొర్రెల కొనుగోలు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు(ఈడీ) కేసు నమోదు చేశారని మెదక్‌ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితమే తనకు

మాజీ సీఎం కేసీఆర్‌పై ఈడీ కేసు నమోదైంది: రఘునందన్‌

మెదక్‌ అర్బన్‌, జూన్‌ 13: గొర్రెల కొనుగోలు వ్యవహారంలో మాజీ సీఎం కేసీఆర్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు(ఈడీ) కేసు నమోదు చేశారని మెదక్‌ బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితమే తనకు హైదరాబాద్‌ నుంచి ఫోన్‌ వచ్చిందన్నారు. మెదక్‌లో గురువారం నిర్వహించిన విజయోత్సవ ర్యాలీ, సన్మానసభలో ఆయన మాట్లాడారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డికి ముందుంది ముసళ్ల పండుగ అని వ్యాఖ్యానించారు. ఈడీ కేసు ప్రభావం వీళ్ల ఇద్దరిపైనా ఉంటుందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక గెలిచామని విర్రవీగిన ఆరడుగుల హరీశ్‌.. ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని ప్రశ్నించారు. అన్ని ఎన్నికలను డబ్బుతో గెలవలేమని ప్రజలు నిరూపించారన్నారు. ఎంపీ ఎన్నికల్లో రూ.500 కోట్లు ఖర్చు పెట్టినా.. వెంకట్రామిరెడ్డి గెలవలేకపోయారని చెప్పారు. రూ.లక్ష కోట్లు ఉన్న వ్యక్తికి ఎంత విలువ ఉంటుందో.. పూటకు బువ్వ లేని కార్యకర్తకు కూడా తమ పార్టీలో అంతే విలువ ఉంటుందన్నారు. మెదక్‌ లోక్‌సభ స్థానంలో బీజేపీ జెండా ఎగరవేసి, ప్రధాని మోదీకి గిఫ్ట్‌ ఇచ్చామన్నారు. పార్లమెంట్‌లో గొప్ప నేతల పక్కన కూర్చునే అవకాశం కల్పించిన మెదక్‌ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు.

Updated Date - Jun 14 , 2024 | 04:16 AM